ప్రస్తుత కాలంలో కొందరు ప్రతీ విషయానికి అనవసరంగా ఆందోళన చెందుతూ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు.అంతేగాక ఈ మధ్యకాలంలో కొందరికి ప్రతి చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకోవడం బాగా అలవాటు అయ్యింది.
తాజాగా పెళ్లి చేసుకోవడం ఇష్టం లేనటువంటి ఓ యువతి తన తల్లిదండ్రులతో ఆ విషయం గురించి చెప్ప లేక ఏకంగా ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రానికి చెందిన “లక్ష్మీ” అనే యువతి తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ నగరంలోని ఎల్బీ నగర్ పరిసర ప్రాంతంలో నివాసముంటోంది.
కాగా ఈమె కుటుంబ పోషణ నిమిత్తం స్థానిక నగరంలో ఉన్నటువంటి ఓ ప్రైవేటు సాఫ్ట్ వేర్ సంస్థలో పని చేస్తుండేది.అయితే ఈ మధ్య తన కుటుంబ సభ్యులు పెళ్లి చేసుకోమని చెబుతున్నప్పటికీ కొంతకాలం పాటు ఆగాలని తన కుటుంబ సభ్యులతో చెబుతూ వస్తుండేది.
అయినప్పటికీ తన కుటుంబ సభ్యులు ఆమె మాటలు వినిపించుకోకుండా తనకి సంబంధాలు చూస్తుండేవారు.
దీంతో ఎన్నోమార్లు తనకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెబుతున్నప్పటికీ ఆమె కుటుంబ సభ్యులు వినిపించకపోవడంతో లక్ష్మీ తీవ్ర మనస్తాపానికి గురైంది.
దీంతో ఏకంగా ఆత్మహత్య ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది.ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో చూసి తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెబుతూ ఉన్నట్లుండి ఫోన్ కట్ చేసి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
పని మీద బయటకి వెళ్లి వచ్చిన ఆమె కుటుంబ సభ్యులు విగత జీవిగా వేలాడుతూన్నటువంటి లక్ష్మి మృతదేహాన్ని చూసి ఒక్కసారిగా బోరున విలపించారు.స్థానికుల నుంచి సమాచారం అందుకున్న టువంటి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని దగ్గరలో ఉన్నటువంటి ఆస్పత్రికి తరలించారు.