టాలీవుడ్ యంగ్ హీరో రానా( Rana ) అనూహ్యంగా హిరణ్యకశ్యప సినిమా ను ప్రకటించిన విషయం తెల్సిందే.దర్శకుడు ఎవరు… నిర్మాత ఎవరు.
తన పాత్ర ఏంటి ఇలాంటి ఏ విషయాలను రానా తెలియజేయలేదు.అయినా కూడా త్రివిక్రమ్ దర్శకత్వంలో రానా హీరోగా హిరణ్య కశ్యప సినిమా( Hiranya Kasyapa ) రాబోతుంది అంటూ ప్రచారం మొదలు అయింది.
గతంలోనే త్రివిక్రమ్( Trivikram ) దర్శకత్వం లో రానా హీరోగా ఈ సినిమా రాబోతుంది అనే వార్తలు వచ్చాయి.ఆ వార్తలు నిజం అన్నట్లుగా తాజా ప్రచారం జరుగుతోంది.
ఈ సమయంలోనే గుణశేఖర్ కడుపు మంట తో రగిలి పోతున్నాడు.తాను చేయాలి అనుకున్న ప్రాజెక్ట్ ను త్రివిక్రమ్ చేతికి రానా ఇవ్వడం పై దర్శకుడు గుణశేఖర్ ఆవేదనతో ఉన్నాడు.
త్రివిక్రమ్ పై కడుపు మంటతో గుణశేఖర్( Guna Sekhar ) కాస్త ఎటకారంతో కూడిన వ్యాఖ్యలు చేస్తున్న విసయం తెల్సిందే.ఈ నేపథ్యం లో సోషల్ మీడియా లో గుణశేఖర్ పై కొందరు తీవ్రంగా కామెంట్స్ చేస్తున్నారు.పదేళ్ల కాలంలో రెండు సినిమా లను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాయి.సరే అవి అయినా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయా అంటే రెండు కూడా నిరాశ పరిచినవే.
రుద్రమదేవి కాస్త పర్వాలేదు అనిపించినా శాకుంతలం( Shaakuntalam ) సినిమా డిజాస్టర్.
ఇలాంటి సినిమాలు తీసిన నీతో ఏ హీరో అయినా పని చేసేందుకు సిద్ధంగా ఉంటాడా… నీతో సినిమా అంటే రిస్క్ అని తెలిసి కూడా వందల కోట్ల బడ్జెట్ ను పెట్టేందుకు నిర్మాతలు వస్తారా అంటూ గుణశేఖర్ ను నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.ఒక సక్సెస్ కొట్టి రానా ను హిరణ్య కశ్యప సినిమాకు డేట్లు ఇవ్వమంటే ఇచ్చేవాడు కాదా నువ్వు చెప్పు అంటూ మీమ్స్ కూడా వస్తున్నాయి.మొత్తానికి ఈ విషయం లో గుణశేఖర్ పై సానుభూతి చూపించకుండా చాలా మంది విమర్శలు చేస్తున్నారు.
మరి ఈ విమర్శలకు గుణ టీమ్ వర్క్ నుండి ఎలాంటి సమాధానం లభిస్తుంది అనేది చూడాలి.హిరణ్య కశ్యప చేజారడంతో గుణశేఖర్ తర్వాత ఏం చేయబోతున్నాడు అనేది చూడాలి.