ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి సెలెబ్రిటీలు అందరూ కూడా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.చిన్న హీరోలు కూడా పాన్ ఇండియా స్థాయిలో సినిమాలను విడుదల చేస్తూ ఉన్నప్పటికీ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ) మాత్రం ఇప్పటివరకు తన సినిమాలను కేవలం రెండు తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిచయం చేశారు.
ప్రస్తుతం ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ ( Trivikram Srinivas ) దర్శకత్వంలో నటిస్తున్న గుంటూరు కారం( Gunturu kaaram ) సినిమా కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కానుంది.ఈయన రాజమౌళి దర్శకత్వంలో చేయబోయే సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఇకపోతే ఇంత టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో ఎవరు అనే రచ్చ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది.ఈ పొజిషన్లో ఎన్టీఆర్ ,అల్లు అర్జున్, ప్రభాస్, రాంచరణ్ వంటి హీరోలు ఈ నెంబర్ వన్ పొజిషన్ లోపోటీ పడుతూ ఉంటారు.అయితే కొన్ని లెక్కల ప్రకారం టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో ఎవరు అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు అనే చెబుతున్నాయి.మరి ఏ విషయంలో మహేష్ బాబు నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు అనే విషయానికి వస్తే.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోలు అందరూ కూడా పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.అయితే మహేష్ బాబు తన సినిమాలను మాత్రం రెండు రాష్ట్రాలకే పరిమితం చేసినప్పటికీ భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకోవడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో తెలుస్తుంది.మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న గుంటూరు కారం సినిమా కోసం ఏకంగా 78 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి.అయితే ఈయన సినిమా రెండు రాష్ట్రాలకు పరిమితమైనప్పటికీ ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అంటే రెమ్యూనరేషన్ విషయంలో మహేష్ బాబు నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నారని తెలుస్తుంది.
ఇలా ఈ సినిమాకి ఈ స్థాయిలో తీసుకుంటే రాజమౌళి(Rajamouli) సినిమాకు మరింత రెమ్యూనరేషన్ తీసుకునే అవకాశాలు లేకపోలేదు.