ప్రాజెక్ట్‌ కే : కావాలనే అలాంటి చెత్త పోస్టర్ ను ఇచ్చారా?

యంగ్ రెబల్‌ స్టార్ ప్రభాస్( Prabhas ) హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రాజెక్ట్‌ కే సినిమా టీజర్‌ మరి కొన్ని గంటల్లో విడుదల కాబోతుంది.అమెరికాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న కామిక్ కాన్ వేడుక లో ప్రాజెక్ట్‌ కే సినిమా టీజర్ ను విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే.

 Prabhas Project K Movie First Look Trolls , Prabhas , First Look , Kamal Haasan-TeluguStop.com

టీజర్ విడుదలకు కొన్ని గంటల ముందు ఒక పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది.హాలీవుడ్ యాక్షన్ సినిమా పోస్టర్ కు ఎవరో ఒక అన్‌ ప్రొఫెషనల్‌ ఫ్యాన్‌ ఎడిట్ చేసినట్లుగా ప్రాజెక్ట్‌ కే పోస్టర్‌ ఉంది అంటూ విమర్శలు వస్తున్నాయి.

Telugu Bollywood, Disha Patani, Nag Ashwin, Prabhas, Project-Movie

సోషల్‌ మీడియా( Social media ) లో ఇలాంటి పోస్టర్ లు గతంలో చాలానే చూశాం.ఇది వాటి మాదిరిగానే సరిగా ఎడిట్ చేయనట్లుగా ఉంది అంటూ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ను తీవ్రంగా విమర్శిస్తున్న వారు చాలా మంది ఉన్నారు.సోషల్ మీడియా లో ఇలాంటి కామెంట్స్ తో ప్రాజెక్ట్‌ కే కి అనూహ్యంగా ప్రచారం లభించింది.ఈ ట్రోల్స్.ఈ మీమ్స్ కోసం యూనిట్‌ సభ్యులు ఇలాంటి ఒక చెత్త పోస్టర్ ను విడుదల చేసి ఉంటారా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి ప్రాజెక్ట్‌ కే( Project k ) విషయం లో ఏం జరుగుతుందో తెలియక అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు.

Telugu Bollywood, Disha Patani, Nag Ashwin, Prabhas, Project-Movie

మరి కొన్ని గంటల్లో రాబోతున్న ప్రోమో ను చూసిన తర్వాత ఫ్యాన్స్ షాక్ అవ్వడం ఖాయం.ప్రతి ఒక్కరు కూడా వావ్‌ అంటూ కితాబివ్వడం కూడా ఖాయం అన్నట్లుగా కామెంట్స్ వస్తున్నాయి.ప్రభాస్ కి జోడీగా ఈ సినిమా లో దీపికా పదుకునే నటించగా కీలక పాత్ర లో దిశా పటానీ నటిస్తోంది.అంతే కాకుండా ఈ సినిమా లో బాలీవుడ్‌ బి బి అమితాబచ్చన్‌ కీలక పాత్ర లో కనిపించబోతున్నాడు.

ఇక యూనివర్శిల్ స్టార్‌ కమల్‌ హాసన్ ని కూడా ఈ సినిమా లో చిన్న గెస్ట్‌ రోల్‌ కోసం తీసుకోవడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube