బీఆర్ఎస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.బీఆర్ఎస్ సర్కార్ ఆర్భాటాలకే పరిమితం అయిందని ఆరోపించారు.
ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహారిస్తుందన్న ఆయన అరకొరగానే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించారని తెలిపారు.కట్టిన ఇళ్లను కూడా లబ్ధిదారులకు ఇవ్వడం లేదని మండిపడ్డారు.
అంతేకాకుండా అకారణంగా బీజేపీ నేతలను అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.బీజేపీ నేతలు ఇళ్ల పరిశీలనకు వెళ్తే ప్రభుత్వానికి భయం ఎందుకని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
పేదలకు ఇళ్లు ఇవ్వాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు.కేంద్రమంత్రి కాన్వాయ్ ను నడిరోడ్డుపై ఆపుతారా అని ప్రశ్నించారు.
కల్వకుంట్ల కుటుంబం వారి నీడను చూసి వారే భయపడుతున్నారని విమర్శించారు.ఈ క్రమంలో యుద్ధం ప్రారంభమైందన్న ఆయన తాము సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.