ఆనంద్ దేవరకొండ( Anand devarakonda ) హీరోగా వైష్ణవి చైతన్య ( Vaishnavi Chaitanya )హీరోయిన్ గా రూపొందిన బేబీ సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.విడుదల అయి వారం కాబోతుంది.ఇప్పటికే సినిమా రూ.50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లుగా సమాచారం అందుతోంది.తెలుగు రాష్ట్రాల్లో గత రెండు మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.వర్షాలతో పోటీ పడుతూ సినిమా వసూళ్లను సొంతం చేసుకుంటూ ఉంది.అన్ని ఏరియాల్లో కూడా సినిమాకు ఇప్పటికే బ్రేక్ ఈవెన్ లభించింది.అయినా కూడా వసూళ్ల విషయం లో అందరిని ఆశ్చర్యానికి గురి చేసేంతగా వసూళ్లు నమోదు అవుతున్నాయి.
ఈ జోరు చూస్తూ ఉంటే సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఆ మధ్య విరూపాక్ష సినిమా( Virupaksha ) వంద కోట్ల క్లబ్ లో చేరిన విషయం తెల్సిందే.ఆ సినిమా తో పోల్చితే ఈ సినిమా మరింత స్పీడ్ గా వంద కోట్లు వసూళ్లు చేయగల సామర్థ్యం ఉన్న సినిమా అన్నట్లుగా బేబీ ని చూసిన వారు అంటున్నారు.ఆనంద్ దేవరకొండ నటన… వైష్ణవి అందాలతో పాటు ఆమె చేసిన పాత్ర నటన.యూత్ ను ఆకట్టుకునే సన్నివేశాలు ఇలా ప్రతి ఒక్కటి కూడా ఆహా ఓహో అన్నట్లుగా ఉండటం వల్ల సినిమా ను భారీ ఎత్తున చూసేందుకు గాను ప్రేక్షకులు క్యూ కడుతున్నారు.
బేబీ సినిమా( Baby movie ) కు అదృష్టం అన్నట్లుగా ఈ వారం పెద్ద సినిమాలు ఏమీ లేవు.చిన్న సినిమా లు విడుదల కాబోతున్నా అందులో కనీసం ఒక్కటి అయినా కాస్త పర్వాలేదు అన్నట్లుగా ఉంటుంది అన్న టాక్ వచ్చిన సినిమా లు లేవు.అందుకే బేబీ సినిమా భారీ వసూళ్లు సాధించడం ఖాయం అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
పవన్ కళ్యాణ్ బ్రో సినిమా వచ్చే వరకు బేబీ ని కదిలించే వారు ఎవరు లేరు.అందుకే మరో వారం రోజుల సమయం సినిమాకు ఉంది.ఆ కారణంగానే వంద కోట్లు సాధించడం పెద్ద కష్టం ఏమీ కాకపోవచ్చు అంటూ టాక్ వినిపిస్తుంది.అతి త్వరలోనే బేబీ సినిమాకు సంబంధించిన వసూళ్ల గురించి బిగ్ బ్రేకింగ్ వినడం ఖాయంగా కనిపిస్తుంది.
అదే వంద కోట్ల వార్త.