అల్లు అర్జున్ పుష్ప( Pushpa ) సినిమాతో నేషనల్ స్టార్ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమాకు, సినిమా పాటలకు పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ లభించింది.
ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా అల్లు అర్జున్( Allu Arjun ) ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఈ సినిమాలోని తన నటనకు ఏకంగా జాతీయ ఉత్తమ నటుడిగా కూడా అవార్డు అందుకున్నారు.తాజాగా ఈయన ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్న విషయం మనకు తెలిసిందే.
ఇలా నేషనల్ అవార్డు అందుకొని తిరిగి హైదరాబాద్ చేరుకున్నటువంటి అల్లు అర్జున్ కు ఘన స్వాగతం లభించింది.
అల్లు అర్జున్ ఇంటి వద్ద అభిమానులందరూ చేరుకొని బన్నీకు ఘనంగా పూల స్వాగతం పలికారు.ఇకపోతే అల్లు అర్జున్ ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు అందుకోవడంతో కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ అవార్డు అందుకున్నటువంటి తొలి నటుడిగా అల్లు అర్జున్ ఈ అవార్డు అందుకోవడంతో కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక అల్లు అర్జున్ నేషనల్ అవార్డు( National Award ) అందుకొని హైదరాబాద్ చేరుకోవడంతో స్నేహ రెడ్డి తండ్రి చంద్రశేఖర్ రెడ్డి ఘనంగా పార్టీ ఇచ్చారు.
స్నేహ రెడ్డి వాళ్ళ నాన్న చంద్రశేఖర్ రెడ్డి ( Chandrasekhar Reddy ) తన అల్లుడికి నేషనల్ అవార్డు వచ్చినందుకుగాను గ్రాండ్ గా పార్టీ అరేంజ్ చేశారు.ఈ పార్టీలో కుటుంబ సభ్యులు అలాగే చిత్ర బృందాన్ని మాత్రమే ఆహ్వానించినట్టు తెలుస్తుంది.ఇలా ఈ పార్టీకి సంబంధించినటువంటి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇక ఇందులో భాగంగా అల్లు అరవింద్ తన ముగ్గురు కుమారులతో కలిసి దిగినటువంటి ఫోటో మరింత స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.పుష్ప సినిమాకు నేషనల్ అవార్డు అందుకోవడంతో ఈ సినిమా సీక్వెల్ చిత్రంపై అల్లు అర్జున్ అలాగే డైరెక్టర్ సుకుమార్ కి కూడా మరింత బాధ్యత పెరిగిందని చెప్పాలి.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.