బిగ్ బాస్ హౌస్ లో తాజాగా సిసింద్రీ టాస్క్ ఏడుపులు గొడవలతో కొట్లాటలతో రసవత్తరంగా సాగింది.అయితే ఈ సిసింద్రీ టాస్క్ లో భాగంగా కొందరు కంటెస్టెంట్లు కాన్సన్ట్రేషన్ తో ఆడగా వసంతి,శ్రీ సత్య లు అసలు గేమ్ లో ఆడారా ఉన్నారా అన్న అనుమానాలువచ్చాయి.
ఇక ఈ టాస్క్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పేరు గీతూ. ఈమె టాస్క్ మొత్తం పక్క వాళ్ళది లాక్కొని వారిని గేమ్ లో నుంచి తీసేద్దామా అన్న ఉద్దేశంతో ఆడుతూ వచ్చింది.
ఆ విధంగా సత్య అభినయ బొమ్మలను బలవంతంగా లాక్కొని ఫౌండ్ లో వేసినప్పటికీ గీతూకి మాత్రం వచ్చిన లాభం శూన్యం అని చెప్పవచ్చు.
ఇక టాస్క్ లో రేవంత్ బొమ్మను గీతూ లాస్ట్ అండ్ ఫౌండ్ లో వేయడంతో అసలు కథ మొదలైంది.
ఇంతకుముందు రేవంత్ టాస్క్ విషయంలో ఫైమా చేసిన తప్పు చివరికి ఆమెకే తగిలింది.అలా మనం చేసిన తప్పు మనకే తిరిగి వస్తుంది అన్నట్టుగా మారిపోయింది.ఇక టాస్క్ లో రేవంత్ ఎంత బ్రతిమలాడినా కూడా ఫైమా తిరిగి తెచ్చి ఇవ్వలేదు.చివరికి రేవంత్ టాస్క్ లో ఓడిపోయాడు.
కానీ ఫైమా కోసం రేవంత్ మళ్లీ నిలబడి పైమా కోసం టాస్క్ ఆడాడు.అలా చివరకు ఫైమా టాస్క్ లో ఘోరంగా ఓడిపోయింది.
కంటెస్టెంట్లు వాళ్ళకి ఇచ్చిన షీల్డ్ తో తోసే చేయాల్సి ఉండగా ఫైమా తన బాడీని మొత్తం ఉపయోగించి తోయాలని చూసిన సంచాలక్ గా ఉన్న రేవంత్ ఆమెను పక్కకు తోసిపడేశాడు.ఈ నేపథ్యంలోనే ఫైమా బొమ్మను తీసి అభినయ లాస్ట్ అండ్ ఫౌండ్ లో వేయగా పైమా టాస్క్ లో నుంచి బయటకు వచ్చి వెక్కివెక్కి ఏడ్చేసింది.తన బాధ కీర్తితో చెప్పుకొని ఎమోషనల్ అయ్యింది.అలా మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లో సిసింద్రీ టాస్క్ ఏడుపులతోనే సాగింది.