అగ్రరాజ్యం అమెరికాలో బియ్యం కొరత ఏర్పడింది.దీంతో బియ్యం కొనుగోళ్లకు ప్రవాస భారతీయులు ఎగబడుతున్నారని తెలుస్తోంది.
అమెరికాలోని అన్ని స్టోర్స్ ముందు నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.ఈక్రమంలో బియ్యం విక్రయాలు చేస్తున్న స్టోర్స్ కు ఎన్ఆర్ఐలు బారులు తీరుతున్నారు.
ఉద్యోగాలకు సెలవులు పెట్టి మరీ సూపర్ మార్కెట్లకు పరుగులు పెడుతున్నారని సమాచారం.బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై భారత్ నిషేధం వార్తతో అమెరికాలో బియ్యం కొరత ఏర్పడుతుందేమోనని ఎన్ఆర్ఐలు ఆందోళన చెందుతున్నారు.
ఈ క్రమంలోనే బియ్యం స్టాక్ క్షణాల్లో ఖాళీ అవుతుందని తెలుస్తోంది.