ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నటువంటి అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందారు.
ఈయన పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఇక అల్లు అర్జున్ ఎంతో సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సంగతి మనకు తెలిసిందే.
తన తాతయ్య అల్లు రామలింగయ్య ( Allu Ramalingaiah ) ఇండస్ట్రీలో ఉన్నట్టుగా కొనసాగుతూ మంచి గుర్తింపు పొందారు ఇక ఆయన వారసత్వాన్ని తన తండ్రి అల్లు అరవింద్( Allu Aravind ) కొనసాగిస్తూ వచ్చారు అయితే అల్లు అర్జున్ నిర్మాతగా ఇండస్ట్రీలో స్థిరపడ్డారు.
ఇలా నిర్మాతగా ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసినటువంటి అల్లు అరవింద్ ప్రముఖ నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.ఇక అల్లు అరవింద్ వారసుడిగా అల్లు అర్జున్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా ఎంతో మంచి సక్సెస్ అయ్యారు.ఇలా సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ కావడంతో పెద్ద ఎత్తున ఆస్తులను కూడా పెట్టారు.
ఇండస్ట్రీలో మల్టీప్లెక్స్ లతో పాటు స్టూడియోను కూడా ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే.
ఇకపోతే అల్లు అర్జున్ కి సంబంధించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అల్లు అర్జున్ తనకు సంబంధించిన విలువైన ఆస్తిని అమ్ముకోబోతున్నారంటూ ఈ వార్త వైరల్ గా మారింది.అయితే ఈయన ఆస్తులను అమ్ముకోవడానికి కారణం ఏమి లేదని నష్టాలు రావడంతోనే ఈ ఆస్తిని అమ్మకానికి పెట్టారంటూ ఒక వార్త చెక్కర్లు కొడుతుంది.
అల్లు అర్జున్ ఓటీటీ వ్యాపార రంగంలోకి అడుగు పెట్టాడు.ఆహా( Aha OTT ) తెలుగు చిన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లలో ఇలాంటి ప్రత్యేకమైన కంటెంట్‌ను అందిస్తూ మంచి ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ గా నిలిచింది.
మొదటి తెలుగులో మాత్రమే ఈ ప్లాట్‌ఫారం ప్రారంభించిన ఈయన అనంతరం తమిళంలో కూడా ప్రారంభించారు.
న్యూ ఇయర్ షిప్ లో విజయం సాధించిన అనేక డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లతో ఆహా ఫైనాన్షియల్ ఛాలెంజ్‌లు ఎదుర్కొంటుందట.అలాగే మూవీస్, వెబ్ సిరీస్ లతో సహా.కంటెంట్.అధిక ధరలు కారణంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు గణనీయంగా లాభాలను అందుకోవడం కష్టంగా మారింది దీంతో పెద్ద ఎత్తున నష్టాలు వస్తున్నాయని భావించి ఆహాను అమ్మడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.