బీజేపీ ( BJP )కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం రేపు సాయంత్రం జరగనుంది.లోక్ సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై బీజేపీ సీఈసీ ప్రధానంగా చర్చించనుంది.
కాగా ఈ సమావేశానికి జేపీ నడ్డా, మోదీ, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, లక్ష్మణ్ హాజరుకానున్నారు.ఇందులో భాగంగా సీఈసీ( CEC ) ఖరారు చేసిన పేర్లకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఆమోదం తెలపనుంది.
తొలి జాబితాలో సుమారు వంద నుంచి 120 మంది లోక్ సభ అభ్యర్థులను బీజేపీ ఖరారు చేయనుంది.ఈ మొదటి జాబితాలో దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎక్కువ స్థానాలను ప్రకటించే అవకాశం ఉంది.
అయితే ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే బీజేపీ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించనుంది.