శాండిల్ వుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నటులలో కిచ్చా సుదీప్ ఒకరు.ఈ ఏడాది విక్రాంత్ రోణా సినిమాతో కిచ్చా సుదీప్ మరో భారీ సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నారు.
హర్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.అయితే తాజాగా కిచ్చా సుదీప్ ఆవులను దత్తత తీసుకోవడం ద్వారా వార్తల్లో నిలవడం గమనార్హం.
ఏకంగా 31 ఆవులను దత్తత తీసుకోవడం ద్వారా కిచ్చా సుదీప్ పేరు మారుమ్రోగుతోంది.కిచ్చా సుదీప్ పుణ్యకోటి దత్త యోజనకు బ్రాండ్ అంబాసిడర్ గా మారడంతో పాటు భారీ సంఖ్యలో ఆవులను దత్తత తీసుకుంటున్నట్టు చేసిన ప్రకటన ఎంతోమందికి సంతోషాన్ని కలిగిస్తోంది.
గోశాలాలను ఆర్థికంగా నిలబెట్టడం కోసం కర్ణాటక సర్కార్ అమలు చేస్తున్న ఈ పథకం గురించి ప్రజల నుంచి కూడా పాజిటివ్ కామెంట్లు వ్యక్తమవుతోంది.
గోవులను దత్తత తీసుకోవాలని సుదీప్ పిలుపునివ్వగా ఈ పిలుపుకు ప్రజల నుంచి ఏ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది.
సుదీప్ తాజాగా గో పూజ నిర్వహించగా అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మరోవైపు సుదీప్ త్వరలో తన భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు సంబంధించి స్పష్టత ఇవ్వనున్నారు.
సుదీప్ సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.
నటుడిగా ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న సుదీప్ ప్లే బ్యాక్ సింగర్ గా కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.సుదీప్ ప్రస్తుతం కబ్జా అనే సినిమాలో నటిస్తుండగా త్వరలో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.కబ్జా సినిమాతో సుదీప్ ఖాతాలో మరో సక్సెస్ చేరుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
సినిమాసినిమాకు సుదీప్ కు నటుడిగా మైలేజ్, క్రేజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.