ప్రతి సంవత్సరం దాదాపుగా 200 సినిమాలు విడుదలైతే ఆ సినిమాలలో ఆకట్టుకునే సినిమాలు 20 కూడా ఉండవు.కొన్ని సినిమాలు ఎప్పుడు విడుదలయ్యాయో కూడా ప్రేక్షకులకు తెలీదు.
ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలలో ప్రేమ సినిమాలను చూస్తే ప్రేక్షకులకు చిరాకేస్తుంది.ఏ మాత్రం సహజత్వం లేని సన్నివేశాలతో ప్రేక్షకులకు కొన్ని సినిమాల మేకర్స్ టార్చర్ చూపిస్తున్నారు.
అయితే కొన్ని సినిమాలు మాత్రం వాస్తవ పరిస్థితులను వెల్లడిస్తూ మనస్సులను మెలిపెట్టే సన్నివేశాలతో తెరకెక్కి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్నాయి.ఈ మధ్య కాలంలో అలాంటి కథాంశంతో తెరకెక్కిన సినిమా ఏదనే ప్రశ్నకు బేబి సినిమా పేరు సమాధానంగా వినిపిస్తుంది.
ప్రేమిస్తే, ఆర్ఎక్స్100( RX 100 ) సినిమాలు ప్రేమ కథలలో సంచలనాలను సృష్టించి ప్రత్యేకంగా నిలవగా బేబి కూడా ఆ జాబితాలో నిలిచింది.
పెయిడ్ ప్రీమియర్లు బేబీ సినిమా( Baby movie ) సక్సెస్ లో కీలక పాత్ర పోషించాయని చెప్పవచ్చు.బేబీ బుకింగ్స్ సైతం పరవాలేదనే స్థాయిలో ఉన్నాయి.మౌత్ టాక్ పాజిటివ్ గా ఉన్న నేపథ్యంలో కలెక్షన్లు పుంజుకునే అవకాశం ఉంది.
పరిమిత బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా కావడంతో నిర్మాతలకు ఈ సినిమా మంచి లాభాలను అందించే అవకాశం అయితే ఉంది.బేబీ సినిమా లవర్స్ కలిసి చూడకపోతే మంచిదని కామెంట్లు వినిపిస్తున్నాయి.
బేబీ సినిమా ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయినా కథనం కొత్తగా ఉండటం ఈ సినిమాకు ప్లస్ అయింది.ఈ సినిమాలో ఎమోషన్స్ గుండెను కదిలించే విధంగా ఉండటం గమనార్హం.చాలామంది ప్రేక్షకులకు ఇది మన ఫ్రెండ్స్ జీవితంలో, మన జీవితంలో జరిగిన కథను పోలి ఉందనే విధంగా ఈ సినిమా ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.మ్యూజిక్, బీజీఎం ఈ సినిమాకు ప్రాణం పోశాయనే చెప్పాలి.
సినిమా నిడివి ఎక్కువైనా ప్రేక్షకులను ఈ సినిమా ఎంతగానో మెప్పించింది.