ఇత‌ను ఎలా గోల్ చేస్తున్నాడో చూస్తే షాక్‌

పుట్‌బాల్‌లో పెనాల్టీ షూటౌట్‌లు చాలా ఫేమస్.దిగ్గజ ఆటగాళ్లు క్రిస్టియానో రొనాల్డో, మెస్సీ, నెయ్‌మార్‌ల పెనాల్టీ షుటౌ‌ట్‌లను అభిమానులు కనులు ఆర్పకుండా చూస్తారు.

 Shock To See How He Is Doing Goal Details, Gole, Viral Video, All Japan High Sch-TeluguStop.com

తాజాగా ఓ ఆటగాడి షూటౌట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఓసారి ఆ వీడియో చూస్తే మీరు నవ్వు ఆపుకోలేరు.

ఈ ఘటన ఆల్ జపాన్ హైస్కూల్ టోర్నమెంట్‌లో చోటుచేసుకుంది.

పెనాల్టీ టైంలో షూటర్ పుట్‌బాల్ చేరుకోవడానికి చాలా సమయం తీసుకున్నాడు.

దాదాపు 40 సెకన్ల టైం తీసుకుని గోల్ సాధించాడు.మొదట షూటర్ ఫుట్‌బాల్ వైపు అలా చూస్తు ఉండిపోయాడు.

అనంతరం చాలా నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ కదిలాడు.కొంత దూరం వెళ్లిన తరువాత కాలును వేగంగా కదిపాడు.

మళ్లీ నెమ్మదించి అటునుంచి వేగంగా పరిగెత్తి పుట్‌బాల్‌ను తన్ని గోల్ చేశాడు.ఇలా షూటర్ నెమ్మది.వేగంగా… మళ్లీ నెమ్మదిగా తరువాత వేగంగా పుట్‌బాల్ చేరుకోని గోల్ చేయడంతో గోల్ కీపర్ అయోమయానికి గురయ్యాడు.ఈ దూరం చేరడానికి దాదాపు 40 సెకన్లు తీసుకున్నాడు షూటర్.

ఈ చర్యతో గోల్ కీపర్ విసుగు చెందాడు.అలాంటి సమయంలో షూటర్ ఒక్కసారిగా వేగంగా వచ్చి ఫుట్‌బాల్‌ను గట్టిగా తన్ని గోల్ చేశాడు.

Ryutsu Kezai Ogashi వర్సెస్ Kindai Wakayama మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆ ఫన్నీ షూట్ ఔట్ జరిగింది.అయితే ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది.Ryutsu నుంచి షూటౌట్ తీసుకున్న ఆటగాడు పెనాల్టీ కిక్‌తో మ్యాచ్‌ను సమం చేశాడు.ఈ పెనాల్టీ షూటౌట్లు ఒక్కొక్కరి శైలి ఒక్కొరకంగా ఉంటుంది.చెల్సియా క్లబ్ స్టార్ ప్లేయర్ జోర్గిన్హో… పెనాల్టీ షూటౌట్ చాలా ఫేమస్.అతను పుట్ బాల్‌కు చాలా దగ్గరగా వచ్చి బౌన్స్ చేస్తూ గోల్స్ సాధిస్తారు.

ఇది చూసిన అభిమానులకు మంచి కిక్ వస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube