విజయ్-రష్మిక సినిమాలో స్టార్ నటుడు.. అఫిషియల్ ప్రకటన!

కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ దళపతి కి ఎంత ఫాలోయింగ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈయనకు తమిళ్ లో రజనీకాంత్ తర్వాత అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకుని అక్కడ ప్రజల చేత సూపర్ స్టార్ గా పిలిపించు కుంటున్నాడు.

 Shaam Joins Cast Of Thalapathy 66 To Play Vijays Brother Details, Actor Shaam, D-TeluguStop.com

ఈయన సినిమా లంటే అక్కడి ప్రేక్షకులు పడి చచ్చిపోతారు.ఈయన గత సినిమా మాస్టర్ 200 కోట్లు వసూలు చేసి కోలీవుడ్ లో సంచలనం నమోదు చేసింది.

ఇక తాజాగా విజయ్ నటించిన సినిమా బీస్ట్. ఈ సినిమా కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కించాడు.సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమాను ఏప్రిల్ 13న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసారు.అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో వర్కౌట్ అవ్వలేదు.

దీంతో మొదటి రోజు నుండే స్లోగా నడిచింది.అలాగే కేజిఎఫ్ సినిమా కూడా ఈ సినిమాను బాగా దెబ్బ కొట్టింది.

దీంతో వసూళ్లు భారీగా పడిపోయాయి.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ తో దిల్ రాజు భారీ పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.

Telugu Shaam, Dil Raju, Telugu Shaam, Thapalathy-Movie

ఈ సినిమాలో రష్మిక నటిస్తుందని అఫిషియల్ గా కూడా ప్రకటించడమే కాకుండా పూజా కార్యక్రమాలతో షూట్ కూడా మొదలు పెట్టేసారు.వంశీ మొదటిసారి ఒక బై లాంగువల్ సినిమాను ఓకే చెయ్యగా దీనిపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.

అయితే తాజాగా ఈ సినిమా నుండి మరొక అఫిషియల్ ప్రకటన వచ్చింది.ఈ సినిమాలో కీలక పాత్ర కోసం ఒక స్టార్ నటుడిని తీసుకున్నారు.ఆయన మరెవరో కాదు.మన తెలుగు వారందరికీ సుపరిచితమే.

ఈయన కిక్, రేసుగుర్రం సినిమాల్లో కీలక పాత్ర పోషించాడు.అతడెవరో గుర్తుకు వచ్చింది కదా.ఆయనే నటుడు శామ్.

Telugu Shaam, Dil Raju, Telugu Shaam, Thapalathy-Movie

ఈయన ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్టు అఫిషియల్ గా ప్రకటించారు.శామ్ తన సోషల్ మీడియా ఖాతాలో ఆయన ఈ సినిమాలో భాగం అయినందుకు.అలాగే విజయ్ తో నటిస్తున్నందుకు ఎగ్జైట్ గా ఉన్నానని చెబుతూ పోస్ట్ చేసి కన్ఫర్మ్ చేసేసాడు.

 ఈ సినిమాలో ఈయన విజయ్ కు బ్రదర్ గా నటిస్తున్నాడని టాక్.మరి చూడాలి ఈయన పాత్ర ఎలా ఉంటుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube