పార్టీ కి గుడ్ బై చెప్పిన టీడీపీ సీనియర్ నేత....పార్టీలో భవిష్యత్తు లేదనే....

ఏపీ లో దాదాపు టీడీపీ పార్టీ అస్థిరపడే పరిస్థితి ఏర్పడింది.గత సార్వత్రిక ఎన్నికల తరువాత ఒక్కొక్కరు వరుసగా పార్టీ మారుతూ టీడీపీ కి ఏపీ లో భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు.

 Senior Leader Gadde Baburao Resigned To Tdp Party, Tdp, Gadde Babu Rao, Ntr, Ys-TeluguStop.com

ఇప్పటికే పలువురు సిట్టింగ్,సీనియర్ నేతలు,మాజీ లు గుడ్ బై చెప్పి వైసీపీ, బీజేపీ తీర్ధం పుచ్చుకోగా ఇప్పుడు తాజాగా విజయనగరం కు చెందిన మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత గద్దె బాబూరావు పార్టీ కి గుడ్ బై చెప్పేశారు.ఆదివారం ఉదయం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన ఆయన ఏ కారణాల రీత్యా పార్టీ కి గుడ్ బై చెప్పాల్సి వచ్చింది అన్న వివరాలను వెల్లడించారు.టీడీపీ లో ఇక తనకు భవిష్యతును లేదన్న కారణంగానే పార్టీ కి రాజీనామా చేయాల్సి వచ్చింది అని ఆయన వివరించారు.2004 నుంచి కూడా పార్టీ అధిష్టానం ఏమాత్రం పట్టించుకోలేదని అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.పార్టీ లో ఒకప్పుడు పరిస్థితులు వేరు అని,ఇప్పటి పరిస్థితులు వేరని ప్రస్తుతం పార్టీ పరిస్థితులు ఏమాత్రం బాగోలేవని, సుదీర్ఘ కాలంగా టీడీపీలో పనిచేసినా గుర్తింపు రాలేదని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.1994-99 ఎన్నికల్లో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ఒకసారి ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు.అయితే పార్టీ కి ఇలా ఆయన రాజీనామా చేయడం ఇదే తొలిసారి ఏమీ కాదు.గతంలో రెండు సార్లు ఇలానే పార్టీ కి రాజీనామా చేసి తిరిగి సొంత గూటికే వచ్చేశారు గద్దె.

మరి ముచ్చటగా మూడోసారి పార్టీ కి రాజీనామా చేసినట్లు తెలుస్తుంది.అయితే ఇప్పుడు టీడీపీ కి గుడ్ బై పలికిన ఆయన వైసీపీ కండువా కప్పుకుంటారా లేదంటే కాషాయ కండువా కప్పుకుంటారా అన్న దానిపై మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

అయితే దీనిపై సమావేశం ఏర్పాటు చేసి ఒక నిర్ణయానికి గద్దె రానున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube