బిగ్ బాస్ 4 వేదికపై గాన గంధర్వుడికి భావోద్వేగ నివాళి...!

ఏదైనా సాధించాలని వాటిని సాకారం చేసుకోవాలని చాలా మంది ప్రయత్నిస్తారు.కానీ, అందులో కొందరు మాత్రమే విజయం సాధిస్తారు.

 Nagarjuna Emotional On Sp Bala Subramanyam Death,sp Bala Subramanyam,nagarjuna ,-TeluguStop.com

అది కూడా ప్రపంచ వ్యాప్తంగా తన పేరును గుర్తింపు పొందేలా చేసుకుంటారు.అలాంటి వ్యక్తి మన ఎస్పి బాల సుబ్రహ్మణ్యం.

కరోనా వైరస్ పాజిటివ్ నేపథ్యంలో మొదటిగా ఆయనను హాస్పిటల్ లో చేర్చగా చికిత్స అనంతరం నెగిటివ్ వచ్చాక అందరూ సంతోషించారు.అయితే ఆ తర్వాత ఆయన ఆరోగ్యం సరిగా లేకపోవడంతో మళ్లీ తిరిగి హాస్పిటల్లో చేరారు.

ఈసారి మాత్రం ఆయన ఆరోగ్యం విషమించడంతో చివరికి అభిమానులు ఎన్ని పూజాలు చేసినా ఫలించలేదు.ఎస్పీ బాలు గారు స్వర్గస్తులయ్యారు.

ఇప్పటికే బాలు లేని లోటును అన్ని చిత్రపరిశ్రమలకు సంబంధించిన వ్యక్తులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకుంటున్నారు.చివరికి అంతర్జాతీయ మీడియా కూడా వారిపై ప్రత్యేక కార్యక్రమం చేసిందంటే ఆయన ఖ్యాతి ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇక తాజాగా స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాల్టీ షో వేదికపై కూడా ఎస్పీ బాలసుబ్రమణ్యం గారికి ఘన నివాళి అర్పించారు.వీకెండ్ కావడంతో బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున వేదికపైకి వచ్చిన తర్వాత బాలుకు నివాళులు అర్పించారు.

ఇందుకు సంబంధించి మొదటగా ప్రోమో రిలీజ్ చేసిన, ఆ తర్వాత షో టైం లో నాగార్జున ఎస్పీ బాలసుబ్రమణ్యం గురించి మాట్లాడుతూ.‘ఆ స్వరం ఇక పలకదని… ఆ వరం మనకు ఇక లేదని ‘ నాగార్జున తెలుపుతూ… ఆయన సంగీతాన్ని గంధర్వులు తప్పక ఆస్వాదిస్తారంటూ నాగార్జున ఉద్వేగంతో తెలియజేశారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.బిగ్ బాస్ షో చూస్తున్న ప్రజలు మరోసారి బాలు స్మృతులను తలుచుకుంటూ ఆయనకు ఘన నివాళి అర్పించారు.

ఇది బిగ్ బాస్ విషయానికి వస్తే ఈ వారం మొత్తం ఏడు మంది వ్యక్తులను నామినేట్ చేయగా శనివారం ఎపిసోడ్ లో ఇద్దర్ని సేవ్ చేశారు.చూడాలి మరి నేటి ఎపిసోడ్ లో మిగతా 5 కంటెస్టెంట్స్ లో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారో.?

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube