సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాట రిజల్ట్ తేలిపోయింది.ఆశించిన స్థాయిలో లేకపోయినా ఫ్యాన్స్ ఎంజాయ్ చేసే కంటెంట్ మాత్రం ఉందని సంతృప్తి చెందుతున్నారు.
అసలైతే పరశురాం అనుకున్న సబ్జెక్ట్ బాగున్నా ఎక్కడో తేడా కొట్టేసిందని మాత్రం చెప్పొచ్చు.ఈ క్రమంలో సర్కారు వారి పాట సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది.
ఇక సర్కారు వారి పాట సినిమా తర్వాత రెండు వారాల గ్యాప్ తో వస్తుంది సూపర్ హిట్ మూవీ ఎఫ్ 2 సీక్వల్ మూవీ ఎఫ్3.
విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న ఈ ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనర్ సినిమా మరోసారి ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తుందని తెలుస్తుంది.ఈమధ్య వచ్చిన టీజర్ కూడా ఆడియెన్స్ ని అలరించింది.సర్కారు వారి పాట సినిమా టాక్ ఖచ్చితంగా ఎఫ్3 కి కలిసి వచ్చే అంశమే అని చెప్పొచ్చు.
అదీగాక పెద్దగా ట్విస్టులు గట్రా లేకుండా హ్యాపీగా నవ్వుకుని వచ్చే సినిమా కాబట్టి ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా కూడా ఎంజాయ్ చేసే ఛాన్స్ ఉంటుంది.మరి ఎఫ్ 2 లానే ఎఫ్ 3 కూడా సూపర్ హిట్ అవుతుందో లేదో చూడాలి.