తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత పాదయాత్రకు సిద్ధమైయ్యారు.ఇందులో భాగంగా ఈనెల 28 నుంచి ప్రజా సంగ్రామ యాత్రను బండి సంజయ్ ప్రారంభించనున్నారు.
ఈ యాత్ర డిసెంబర్ 15వ తేదీ వరకు కొనసాగనుంది.ఈ క్రమంలో 28న నిర్మల్ జిల్లాలోని బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భైంసా నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారని సమాచారం.
అదేవిధంగా భైంసాలో మొదటి రోజు బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది.కాగా ఈ ప్రజా సంగ్రామ యాత్ర భైంసా నుంచి కరీంనగర్ జిల్లా వరకు కొనసాగనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.