పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న సినిమా రాధే శ్యామ్.ఈ సినిమాలో బుట్టబొమ్మ
పూజ హెగ్డే
హీరోయిన్ గా నటిస్తుంది.
గత రెండు సంవత్సరాలుగా సెట్స్ మీదనే ఉన్న ఈ సినిమా ఎట్టకేలకు వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.దాంతో ప్రమోషన్స్ ఇప్పటి నుండే చేస్తూ వరుస అప్డేట్ లు వదులుతున్నారు.
తాజాగా ఈ సినిమా నుండి మూడవ సాంగ్ ను విడుదల చేసారు.‘సంచారి‘ సాంగ్ టీజర్ ను మేకర్స్ విడుదల చేసారు.ఓన్లీ మ్యూజిక్ తో ప్రభాస్ లుక్ ను రివీల్ చేసారు.ప్రభాస్ ఈ సినిమాలో ఫ్యాన్స్ అందరు ఆశ్చర్య పోయే విధంగా అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు.
పూర్తి పాటను ఈ నెల 16న విడుదల చేయబోతున్నారు.చలో చలో సంచారి అంటూ సాగే ఈ పాటను అనిరుద్ రవిచందర్ ఆలపించారు.
ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించాడు.ఇప్పటికే విడుదల అయిన రెండు పాటలు అందరిని అలరించాయి.ఇక ఈ పాట కూడా అలరిస్తుందని మేకర్స్ అభిప్రాయపడుతున్నారు.ఈ సినిమా 1970 లో యూరప్ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథ.తాజాగా రిలీజైన ఈ టీజర్ చూసిన అభిమానులు డార్లింగ్ లుక్ కు ఫిదా అవుతున్నారు.యువీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులంతా ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు.
ఇక ప్రభాస్ ఈ సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా.బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా చేస్తున్నాడు.
అంతేకాదు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే సినిమాలో కూడా ప్రభాస్ నటిస్తున్నాడు.