ఒక సినిమాకు అదే ప్రాణం.. హనుమాన్ సినిమా పై సమంత రివ్యూ?

సంక్రాంతి పండుగ సందర్భంగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ( Prashanth Varma ) దర్శకత్వంలో తేజ( Teja ) హీరోగా నటించినటువంటి హనుమాన్ ( Hanuman ) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమాకు పలువురు స్టార్ సెలబ్రిటీలు మద్దతు తెలియజేస్తూ సినిమాను ప్రమోట్ చేశారు.

 Samantha Gives Review On Hanuman Movie , Hanuman Movie, Teja Sajja, Prashanth Va-TeluguStop.com

ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైనటువంటి ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది.ఈ సినిమా స్టార్ హీరోల సినిమాలను కూడా వెనక్కి నెట్టి మరి సంచలనమైనటువంటి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమాకు టాలీవుడ్ నటి సమంత ( Samantha ) కూడా సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా సినిమాని ప్రమోట్ చేసారు.ఇక తాజాగా ఈ సినిమాని చూసినటువంటి ఈమె ఈ సినిమాకు తన రివ్యూ ఇస్తూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.మనల్ని మళ్లీ బాల్యంలోకి తీసుకువెళ్లగలిగే చిత్రాలు ఎంతో ఉత్తమమైనవి హనుమాన్ సినిమా విజువల్స్, మ్యాజిక్ కామెడీ మ్యూజిక్ అన్ని ఎంతో అద్భుతంగా ఉన్నాయి.థాంక్యూ ప్రశాంత్ వర్మ నీ యూనివర్స్ నుంచి మళ్లీ రాబోయే సినిమాల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను.

తేజ సజ్జ నీ నటనతో నన్ను ఆశ్చర్యపోయేలా చేసావు నీ కామిక్ టైమింగ్ నీ నటన అమాయకత్వం హనుమంతుడిగా నువ్వు చేసిన యాక్టింగ్ ఈ సినిమాకి ప్రాణంగా నిలిచింది.ఇక ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఎంతో అద్భుతంగా నటించారు అంటూ ఈమె చిత్ర బృందంపై అలాగే డైరెక్టర్ పని తీరు గురించి ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.ఇక ఈ సినిమా ఇప్పటికీ ఎంతో విజయవంతంగా థియేటర్లలో ప్రసారమవుతున్న సంగతి మనకు తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube