టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్, గ్లామర్ బ్యూటీ సమంత గురించి తెలియనివారు ఎవరూ లేరు.ప్రస్తుతం ఈ అమ్మడు ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.
వరుస ఆఫర్లతో బాగా బిజీ గా మారింది.నాగచైతన్యతో విడాకుల తర్వాత కొత్త జీవితంలోకి అడుగు పెట్టి మరింత యాక్టివ్ గా మారింది.
చైతు తో ఉన్న బంధాన్ని తలుచుకోకుండా ముందుకు సాగుతుంది.పైగా ప్రతి ఒక పాత్రలో నటించడానికి సిద్ధంగా ఉంది.
అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ లో డీ గ్లామర్ లుక్ తో కుర్రాళ్లను ఫిదా చేసి పిచ్చెక్కించింది.తొలిసారిగా ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.
ఆ తర్వాత వెనుదిరిగి చూడకుండా ఓ రేంజ్ లో దూసుకెళ్లి స్టార్ హోదాను సంపాదించుకుంది.ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.
కెరీర్ మొదట్లోనే నాగచైతన్యతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది.
అక్కినేని కుటుంబం లో చేరి మంచి లైఫ్ లోకి అడుగు పెట్టింది.
ఇక ఇద్దరు కలిసి సినిమాలు, పలు ప్రకటనలలో కూడా చేశారు.సమంత కొన్ని వ్యాపారాలు కూడా ప్రారంభించింది.
మొత్తానికి నాగచైతన్యను పెళ్లి చేసుకున్నాక సమంత కు బాగా కలిసొచ్చింది.కానీ గత ఏడాది కొన్ని వ్యక్తిగత విషయాలలో ఇద్దరికి మనస్పర్థలు రావడంతో విడిపోయి షాక్ ఇచ్చారు.ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తామే తెలుపుకున్నారు.
అలా సమంత చైతును విడిపోయిన తర్వాత మరింత యాక్టివ్ గా మారడానికి చాలా ప్రయత్నించింది.చాలావరకు సోషల్ మీడియా వేదికగా తను రిఫ్రెష్ అయ్యింది.మోటివేషనల్ కు సంబంధించిన ఎమోషనల్ కొటేషన్స్ తో మళ్లీ తన జీవితాన్ని కొత్తగా పరిచయం చేసుకుంది.
తన గతాన్ని మర్చిపోవడానికి అప్పుడప్పుడు తన స్నేహితులతో కలిసి బాగా ట్రిప్స్ ఎంజాయ్ చేస్తుంది.ఇక ఇప్పటికీ తను ఏదో ఒక పోస్టు తో బాగా చర్చనీయాంశంగా మారుతోంది.
ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టాల్ లో ఓ పోస్ట్ షేర్ చేసుకుంది.
ఇక అందులో సమంత తన ఫ్రెండ్ నందు రెడ్డితో ఫోటో దిగి కనిపించగా ఆ ఫోటోకు కొంత స్టోరీ కూడా పంచుకుంది.పైగా నందు రెడ్డి బర్త్ డే సందర్భంగా తనకు విషెస్ తెలిపి తనతో తనకు ఉన్న సంబంధం గురించి పంచుకుంది.కష్టాల్లో కూడా తోడు ఉంది అంటూ.
తన వల్లే ఇదంతా జరిగింది అంటూ ఎమోషనల్గా పంచుకుంది.
ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.
ఇక ప్రస్తుతం సమంత వరస ప్రాజెక్టులతో బాగా బిజీగా ఉంది.కేవలం టాలీవుడ్ లోనే కాకుండా అటు బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకుంటోంది.
గతంలో తాను నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.ఇటీవలే మరో సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ లో నటించే అవకాశం అందుకుందని టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.