ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ చీఫ్ పురంధేశ్వరి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఎన్టీఆర్ నాణెం ఆవిష్కరణలో తమ కుటుంబం అంతా పాల్గొందని తెలిపారు.
ఎన్టీఆర్ నాణెం ఆవిష్కరణ కార్యక్రమంపై సజ్జల వ్యాఖ్యలు సరికాదని పురంధేశ్వరి పేర్కొన్నారు.రాష్ట్రపతి పాల్గొన్న కార్యక్రమాన్ని రాజకీయం చేయడం తగదని చెప్పారు.
మరోవైపు ఇవాళ బీజేపీ ఆధ్వర్యంలో విజయవాడలో శంఖానాదం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.ఎన్నికల సమయానికి అందరూ సన్నద్ధం కావాలని చెప్పారు.
ఎన్నికల సమర శంఖం పూరించేలా శంఖానాదం పేరు పెట్టామని తెలిపారు.మహిళల కోసం మోదీ ఒక అన్నగా అండగా నిలిచారని పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ మోదీ అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు.గ్రామ పంచాయతీల నిధుల మళ్లింపుపై తాము పోరాటం చేశామని తెలిపారు.
ఈ నేపథ్యంలో అన్ని అంశాలను గవర్నర్, కేంద్ర పెద్దలకు ఫిర్యాదు చేశామని వెల్లడించారు.