1992 తమిళనాడులోని కోటగిరి అనే గ్రామంలో బడుగు గిరిజన కుటుంబంలో జన్మించింది నటి సాయి పల్లవి ( Sai pallavi ).ఈమె తండ్రి ఈమెను డాక్టర్ చేయాలి అనే ఉద్దేశంతో వైద్య విద్యను చదివించాడు.
అలా సాయి పల్లవి వైద్య విద్యను అభ్యసించింది.అలాగే సాయి పల్లవి మంచి డాన్సర్ కూడా.
ఈమె ఇప్పటికే చాలా స్టేజ్ పెర్ఫార్మన్స్ లు కూడా ఇచ్చింది.అలాగే సాయి పల్లవి మొదటిగా స్క్రీన్ పై కనిపించింది కంగనా రనౌత్ ( Kangna ranaut ) హీరోయిన్ గా వచ్చిన ధూంధాం అనే సినిమాలో నటించింది.
ఈ సినిమాలో హీరోయిన్ పక్కన చిన్న పాత్రలో నటించింది.ఆ తర్వాత మీరా జాస్మిన్ హీరోయిన్ గా చేసిన కస్తూరి మాన్ అనే సినిమాలో మీరా జాస్మిన్ క్లాస్మేట్ గా కూడా చేసింది.
ఆ తర్వాత మొదటిసారి తమిళ ప్రేమమ్ ( Premam ) సినిమాలో నటించి, తెలుగులో ఫిదా( Fida ) సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.ఈ సినిమా తర్వాత ఎంసీఏ, పడి పడి లేచే మనసు, శ్యాం సింగరాయ్, లవ్ స్టోరీ వంటి కొన్ని సినిమాల్లో నటించింది.
అయితే ఇప్పటివరకు ఈ హీరోయిన్ ఏ సినిమాలో కూడా ఎక్స్పోజింగ్ చేయలేదు.అయితే అలాంటి సాయి పల్లవి తన తండ్రి చేతిలో ఆ హీరో కారణంగా తన్నులు తిన్నదట.
అసలు విషయం ఏమిటంటే.సాయి పల్లవికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan kalyan ) అంటే పిచ్చి ఇష్టమట.ఎంతలా అంటే ఆయన సినిమా ఏది వచ్చినా సరే ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తుందట.ఇక కాలేజీ రోజుల్లో కూడా చాలాసార్లు కాలేజ్ బంక్ కొట్టి పవన్ కళ్యాణ్ సినిమాకు వెళ్లేదట.
అయితే ఓ రోజు పవన్ కళ్యాణ్ సినిమా చూడడానికని వెళ్లి రాత్రి అయినా సరే ఇంటికి రాలేదట సాయి పల్లవి.
దాంతో ఇంట్లో వాళ్ళందరూ సాయి పల్లవి ( Sai pallavi ) కి ఏమైందో అని అందరూ కంగారు పడ్డారట.ఇక ఆ టైంలో ఇంటికి వచ్చిన సాయి పల్లవిని అందరూ తిట్టారట.అంతేకాదు ఆయన తండ్రి లాగిపెట్టి చెంప పై కొట్టారట.
ఇంత రాత్రి అయింది ఇంటికి రావాలనే ధ్యాస లేదా ఎక్కడికి వెళ్లావు అని తిడితే నాన్న నేను పవన్ కళ్యాణ్ సినిమాకి వెళ్లాను అని చెప్పిందట.సినిమా అయితే నేను తీసుకెళ్లే వాడిని కదా ఇంత నైట్ పూట అమ్మాయిలు తిరగడం అవసరమా అని వార్నింగ్ ఇచ్చి ఇంకొకసారి అలా చేయకు అంటూ గట్టిగా చెప్పారట.
ఇక అప్పటి నుండి సాయి పల్లవి తన ఇంట్లో వాళ్లకి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళేదికాదట.అయితే ఈ విషయాన్ని స్వయంగా సాయిపల్లవి ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.
ఇక దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సాయి పల్లవికి పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో అని పవన్ కళ్యాణ్ (Pawan kalyan) అభిమానులు సంబరపడిపోతున్నారు.అలాగే ఇండస్ట్రీలోకి వచ్చాక సాయి పల్లవి ఓ సారి పవన్ కళ్యాణ్ ని కలిసి ఆయన మంచి నిజాయితీ గల మనిషి అంటూ కూడా కాంప్లిమెంట్ ఇచ్చింది.