మెగాస్టార్ తో సాయి తేజ్.. ఆ కోరిక తీరేనా?

మెగా ఫ్యామిలి నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వారిలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ( Sai Dharam Tej ) ఒకరు.మెగా మేనల్లుడుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఈయన తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కోసం డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ హిట్స్ అందుకోవాలని ట్రై చేస్తున్నాడు.

 Sai Dharam Tej Interesting Comments On Megastar, Sai Dharam Tej, Pawan Kalyan, B-TeluguStop.com

సాయి తేజ్ లాంగ్ గ్యాప్ తీసుకుని నటించిన విరూపాక్ష సినిమా ( Virupakasha )తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.ఈ సినిమా 100 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి సాయి తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

ఈ సినిమా తర్వాత సాయి తేజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి ఒక మల్టీస్టారర్ సినిమా ‘బ్రో‘ ( Bro ) లో నటించగా ఇది యావరేజ్ గా నిలిచింది.

Telugu Bro, Ganja Shankar, Chiranjeevi, Pawan Kalyan, Sai Dharam Tej, Sampath Na

ఇక ఈ సినిమా తర్వాత ఇప్పుడు మరో రెండు సినిమాలను లైన్లో పెట్టుకున్నాడు సాయి తేజ్.బ్రో తర్వాత సంపత్ నంది ( Director Sampath Nandi ) దర్శకత్వంతో సాయి తేజ్ ”గాంజా శంకర్” అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమా సాయి తేజ్ పూర్తిగా మాస్ అండ్ రగ్డ్ లుక్ లో అయితే కనిపించనున్నారు.

Telugu Bro, Ganja Shankar, Chiranjeevi, Pawan Kalyan, Sai Dharam Tej, Sampath Na

ఇదిలా ఉండగా తాజాగా సాయి తేజ్ ట్విట్టర్ లో ఆస్క్ సాయి తేజ్ చాట్ సెషన్ లో పాల్గొనగా ఈయనను ఫ్యాన్స్ పలు ప్రశ్నలు అడుగగా అన్నిటికి సాయి తేజ్ జవాబు చెప్పారు.ఈ క్రమంలోనే ఒక ఫ్యాన్ ఇంట్రెస్టింగ్ ప్రశ్న అడిగారు.చిన్న మామయ్య పవన్ కళ్యాణ్ తో నటించారు మరి మెగాస్టార్ తో ఎప్పుడు నటిస్తారు అంటూ అడుగగా సాయి తేజ్ ఆన్సర్ ఇచ్చారు.నేను కూడా ఆ ఛాన్స్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను అంటూ చెప్పాడు.

మరి తేజ్ కు మెగాస్టార్ ( Megastar Chiranjeevi ) ఛాన్స్ ఇస్తారో లేదో ఇస్తే ఎలాంటి రోల్ లో నటిస్తారో చూడాలి.కాగా ”గాంజా శంకర్” ( Ganja Shankar) సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తుండగా ఈ కాంబో ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube