మెగాస్టార్ తో సాయి తేజ్.. ఆ కోరిక తీరేనా?
TeluguStop.com
మెగా ఫ్యామిలి నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వారిలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ( Sai Dharam Tej ) ఒకరు.
మెగా మేనల్లుడుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఈయన తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కోసం డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ హిట్స్ అందుకోవాలని ట్రై చేస్తున్నాడు.
సాయి తేజ్ లాంగ్ గ్యాప్ తీసుకుని నటించిన విరూపాక్ష సినిమా ( Virupakasha )తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.
ఈ సినిమా 100 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి సాయి తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
ఈ సినిమా తర్వాత సాయి తేజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి ఒక మల్టీస్టారర్ సినిమా 'బ్రో' ( Bro ) లో నటించగా ఇది యావరేజ్ గా నిలిచింది.
"""/" /
ఇక ఈ సినిమా తర్వాత ఇప్పుడు మరో రెండు సినిమాలను లైన్లో పెట్టుకున్నాడు సాయి తేజ్.
బ్రో తర్వాత సంపత్ నంది ( Director Sampath Nandi ) దర్శకత్వంతో సాయి తేజ్ ''గాంజా శంకర్'' అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఈ సినిమా సాయి తేజ్ పూర్తిగా మాస్ అండ్ రగ్డ్ లుక్ లో అయితే కనిపించనున్నారు.
"""/" /
ఇదిలా ఉండగా తాజాగా సాయి తేజ్ ట్విట్టర్ లో ఆస్క్ సాయి తేజ్ చాట్ సెషన్ లో పాల్గొనగా ఈయనను ఫ్యాన్స్ పలు ప్రశ్నలు అడుగగా అన్నిటికి సాయి తేజ్ జవాబు చెప్పారు.
ఈ క్రమంలోనే ఒక ఫ్యాన్ ఇంట్రెస్టింగ్ ప్రశ్న అడిగారు.చిన్న మామయ్య పవన్ కళ్యాణ్ తో నటించారు మరి మెగాస్టార్ తో ఎప్పుడు నటిస్తారు అంటూ అడుగగా సాయి తేజ్ ఆన్సర్ ఇచ్చారు.
నేను కూడా ఆ ఛాన్స్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను అంటూ చెప్పాడు.
మరి తేజ్ కు మెగాస్టార్ ( Megastar Chiranjeevi ) ఛాన్స్ ఇస్తారో లేదో ఇస్తే ఎలాంటి రోల్ లో నటిస్తారో చూడాలి.
కాగా ''గాంజా శంకర్'' ( Ganja Shankar) సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తుండగా ఈ కాంబో ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలి.
బాలయ్య డాకు మహరాజ్ హిట్ తో చిరంజీవి మీద ప్రెజర్ పెరుగుతుందా..?