మెగా మేనల్లుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి సాయిధరమ్ తేజ్( Sai Dharam Tej )తన నటనతో ప్రేక్షకులను మెప్పించి సుప్రీం హీరోగా పేరు సంపాదించుకున్నారు.ఇలా ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన చివరిగా బ్రో ( Bro ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి గుర్తింపు పొందారు.
ఇక ఈ సినిమా ద్వారా తన మావయ్య పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) తో కలిసి సాయి తేజ్ సందడి చేసిన సంగతి తెలిసిందే.ఇకపోతే ఈయన సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి 9 సంవత్సరాలను పూర్తి చేసుకుంది.
పిల్లా నువ్వు లేని జీవితం అనే సినిమా ద్వారా సాయి ధరంతేజ్ ఇండస్ట్రీలోకి హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
2014 నవంబర్ 14వ తేదీ ఈ సినిమా విడుదలై ముందుకు వచ్చింది.అయితే ఈ సినిమా విడుదల అయ్యి 9 సంవత్సరాలు పూర్తి కావడం విశేషం ఇలా తన తొమ్మిది సంవత్సరాల సినీ కెరియర్ పూర్తి చేసుకున్నటువంటి సాయి ధరంతేజ్ సరదాగా అభిమానులతో కలిసి ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.ఈ క్రమంలోనే చాలామంది వివిధ రకాల ప్రశ్నలను వేశారు.
పవన్ కళ్యాణ్ గారితో కలిసి బ్రో సినిమాలో నటించారు.మరి పెద్ద మామయ్యతో ఎప్పుడు చేస్తున్నారు అంటూ ప్రశ్నించగా సరైన కథ వస్తే తప్పకుండా చేస్తానని చెప్పారు.
మీ బావ రామ్ చరణ్ తో కలిసి మల్టీ స్టార్టర్ చేసే అవకాశాలు ఉన్నాయా అని అనడంతో తప్పకుండా చేస్తానని అయితే ఇద్దరికీ సరిపోయే కథ చేస్తామని తెలిపారు.ఇక మీ కెరియర్ లో నటించిన సినిమాలలో మీకు ఇష్టమైన సినిమాలు ఏంటి అంటూ ఒక నెటిజన్ ప్రశ్నించారు ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ.చిత్ర లహరి, రిపబ్లిక్ ( Republic )ఈ రెండు పాత్రలు తనుకు చాలా ఇష్టమని చెప్పారు అయితే రిపబ్లిక్ అని టైప్ చేసేటప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్ అయింది దీంతో నేటిజన్ వెంటనే రియాక్ట్ అవుతూ అది రిలబ్లిక్ కాదు రిపబ్లిక్ బుర్ర తక్కువ వెధవ ఎప్పుడైనా స్కూల్ కి వెళ్ళావా అంటూ రాసుకు వచ్చారు దీంతో స్పందించిన సాయి తేజ్ మీరు చెప్పింది నిజమే మా స్కూల్లో చదువుతోపాటు గౌరవం ఇవ్వడం కూడా నేర్పించారు.మీ స్కూల్లో నేర్పించారా? నేర్పించకపోతే నేర్చుకో అంటూ కౌంటర్ ఇచ్చారు.హీరో ఇలా రియాక్ట్ అవడంతో వెంటనే స్పందించినటువంటి నేటిజన్ మీరు రిప్లై ఇవ్వరని అలా పెట్టానని క్షమించమని కోరుతూ కామెంట్ చేశారు.ప్రస్తుతం ఇది కాస్త వైరల్ గా మారింది.