వన్డే వరల్డ్ కప్ లో భాగంగా నేడు ముంబైలోని వాఖండే వేదికగా భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య సెమీఫైనల్ మ్యాచ్ చాలా ఉత్కంఠ భరితంగా జరగనుంది.ఈ మ్యాచ్లో గెలిచి ఫైనల్ వెళ్లాలని రెండు జట్లు గట్టి పట్టుదలతో బరిలోకి దిగనున్నాయి.2019లో న్యూజిలాండ్( New Zealand ) చేతిలో భారత్ ఓడిన సంగతి తెలిసిందే.అందుకు ప్రతీకారంగా నేటి మ్యాచ్లో న్యూజిలాండ్ ను ఓడించాలనే కసితో రోహిత్ సేన బరిలోకి దిగనుంది.
ఈ సెమీఫైనల్ మ్యాచ్లో టాస్ అత్యంత కీలక పాత్ర పోషించనుంది.వాఖండే మైదానం( Wankhede Stadium ) పిచ్ మొదట బ్యాటింగ్ చేసే జట్టుకు పూర్తిగా సహకరిస్తుంది.కాబట్టి వాఖండే వేదికపై మొదట బ్యాటింగ్ చేసే జట్టు అత్యంత భారీ పరుగులు చేసే అవకాశం ఉంది.కాబట్టి వాఖండే లో జరిగే మ్యాచ్లో టాస్ గెలిచిన జట్టు కచ్చితంగా బ్యాటింగ్ చేయాలని అనుకుంటుంది.
భారత్ ఈ మ్యాచ్ లో టాస్ గెలిస్తే దాదాపుగా మ్యాచ్ గెలిచినట్టే.
ఈ వాఖండే పిచ్ లో గతంలో మొదట బ్యాటింగ్ చేసిన జట్లు భారీ పరుగులు చేసిన సందర్భాలు చాలా అంటే చాలా ఉన్నాయి.అంతెందుకు ఇదే టోర్నీలో భారత్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్లో టాస్ ఓడిన భారత్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి అత్యధిక పరుగులు చేసింది.ఆ తర్వాత లక్ష్య చేదునకు దిగిన శ్రీలంక జట్టు( Sri Lanka )ను ఏకంగా 302 పరుగుల తేడాతో భారత్ ఓడించింది.
ఇది దృష్టిలో ఉంచుకున్న సెమీఫైనల్ ఆడే జట్లు కచ్చితంగా టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకుంటాయి.ఈ మైదానంలో బౌండరీ చిన్నదిగా ఉండడం వల్ల బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లతో చెలరేగే అవకాశం ఉంది.
కాబట్టి భారత జట్టు మొదట బ్యాటింగ్ చేసి భారీ లక్ష్యాన్ని న్యూజిలాండ్ ముందు ఉంచితే.ఇక న్యూజిలాండ్ బ్యాటర్ల సంగతి భారత పేసర్లు చూసుకుంటారు.ఇక మ్యాచ్ కు ఒకవేళ వర్షం అంతరాయం కలిగిస్తే రిజర్వ్ డే ఉంది కాబట్టి మ్యాచ్ కచ్చితంగా 100% జరుగుతుంది.ఈ మ్యాచ్ లో ఏ జట్టు ఫైనల్ చేరుతుందో.
ఏ జట్టు ఇంటిదారి పడుతుందో వేచి చూడాల్సిందే.