భారతదేశంలో విదేశీయులను దేవుళ్ళుగా భావిస్తారు.అతిథిదేవోభవ అంటే అతిథిని దేవుడుతో సమానంగా భావించే గొప్ప సంస్కృతి మనది.
అయితే కొందరి పిచ్చి ప్రవర్తన వల్ల ఈ సంస్కృతికి మచ్చ ఏర్పడుతోంది.తాజాగా జైపూర్‌లోని( Jaipur ) పెట్రోల్ పంపు వద్ద రష్యాకు( Russia ) చెందిన ఒక పర్యాటకురాలు వేధింపులకు గురైంది, ఆమె తన ఇండియన్ ఫ్రెండ్‌తో కలిసి జైపూర్ నగరం తిరుగుతోంది ఈ క్రమంలో ఆమె తన ఫ్రెండ్ బైక్ ఎక్కింది.
అయితే ఆ ఫ్రెండ్ బైక్‌లో పెట్రోల్ రీఫిల్ చేస్తున్నప్పుడు బంక్‌లోని ఒక వర్కర్ ఆమెను అనుచితంగా తాకాడు.ఢిల్లీకి చెందిన ఆమె ఫ్రెండ్ ఒక ట్రావెల్ వ్లాగర్, ‘ఆన్ రోడ్ ఇండియన్’ అనే యూట్యూబ్ ఛానెల్‌ని నడుపుతున్నాడు.
తన రష్యా స్నేహితురాలని సదరు వ్యక్తి అసభ్యంగా టచ్ చేయడానికి ఈ వ్లాగర్ గమనించాడు.ఈ సంఘటనను కెమెరాలో కూడా బంధించాడు.
బైక్‌పై వెనుక కూర్చున్న తన రష్యన్ స్నేహితుడి పట్ల కార్మికుడు అసభ్యంగా ప్రవర్తించడాన్ని వ్లాగర్( Vlogger ) గమనించి, వీడియోను సాక్ష్యంగా రికార్డ్ చేయడం ప్రారంభించాడు.ఆపై అతను వర్కర్ ని నిలదీశాడు, ఒక మహిళతో ఇలా ఎలా ప్రవర్తిస్తావని భయపెడుతూ ప్రశ్నించాడు.
తన అనుమతి లేకుండా ఆ కార్మికుడు తనను మూడుసార్లు తాకాడని రష్యా మహిళా టూరిస్ట్( Russian Woman Tourist ) చెప్పింది.పెట్రోల్ పంప్‌లోని ఇతర ఉద్యోగులు క్షమాపణలు చెప్పి, సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించారు, కానీ వ్లాగర్ ఈ విషయాన్ని అక్కడితో వదిలేయడానికి ఒప్పుకోలేదు.
ఏమి చేయాలనుకుంటున్నావో చెప్పు అని రష్యా ఫ్రెండ్ ని అడిగాడు.పోలీసులకు ఫోన్ చేసి వేధింపులపై ఫిర్యాదు చేయాలని అనుకుంటున్నట్లు ఆమె తెలిపింది.
అంతే అతడు వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు.పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రష్యా పర్యాటకుడికి క్షమాపణ చెప్పాలని కార్మికుడిని కోరారు.అయినప్పటికీ, ఆమె అతని క్షమాపణతో సంతృప్తి చెందలేదు, అతను తన నేరాన్ని మళ్లీ రిపీట్ చేసే అవకాశం ఉందని అలాంటప్పుడు ఇతడిని కఠినంగా శిక్షించాలని ఆమె పోలీసులను కోరింది అతడి పేరును కూడా నోట్ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.పోలీసులు ఆమె అభ్యర్థనకు కట్టుబడి అతని వివరాలను తీసుకున్నారు.
వ్లాగర్ తరువాత వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో అప్‌లోడ్ చేశాడు, అక్కడ అది దృష్టిని ఆకర్షించింది, ఆగ్రహాన్ని రేకెత్తించింది.నవంబర్ 7న ఈ ఘటన జరిగిందని, అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ముందుగా వీడియోను అప్‌లోడ్ చేయలేకపోయానని చెప్పారు.మహిళలను గౌరవించాలని, ఎలాంటి వేధింపులను సహించవద్దని తన ప్రేక్షకులను కోరారు.