రష్యా తనకు అనుకూలంగా వున్న దేశాలకు పర్యాటక వీసా అవసరాలను మరింత సులభతరం చేసే యోచన చేసిన సంగతి తెలిసినదే.ఆ జాబితాలో భారత దేశం ప్రధమ స్థానంలో ఉండటం గమనార్హం.
దీంతో భారతీయులు ఎవరైనా ఆ దేశాన్ని సందర్శించాలనుకుంటే పర్యాటక వీసాలు సులభరీతిలో వచ్చే అవకాశాలు కలదు.ఇంకా పలు దేశాల పర్యాటకులు కూడా అక్కడికి వెళ్లేందుకు వీసా-రహిత ప్రయాణాన్ని ఆస్వాదించే వీలుంది.
ఈ విషయమై భరత్ తో పాటు మరో 5 దేశాలకు చెందిన అర్హులైన పౌరులకు వీసాలను తక్షణమే జారీ చేసేలా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కొత్త మార్గదర్శకాలను విడుదల చేశారు.
ఈ విషయమై వీసాల మంజూరులో కాలయాపన జరగదని, త్వరగా వీసా పొందే వీలుందని రష్యా డిప్యూటీ విదేశాంగ మంత్రి ఐనటువంటి ఇగోర్ ఇవానోవ్ రష్యా న్యూస్ ఏజెన్సీ టీఏఎస్ఎస్ తో అన్నారు.వీసా జారీ చేసే విధానాల విషయంలో రష్యా ప్రభుత్వం భారత్ తో పాటుగా అంగోలా, ఇండోనేషియా, వియత్నాం, సిరియా, ఫిలిప్పీన్స్లతో కలిసి పని చేస్తోంది అని ఇవనోవ్ ఈ సందర్బంగా తెలిపారు.ఇంతకు ముందు, రష్యా వీసా- ఫ్రీ ట్రిప్స్ కోసం సౌదీ అరేబియా, బార్బడోస్, హైతీ, జాంబియా, కువైట్, మలేషియా, మెక్సికో, ట్రినిడాడ్ సహా 11 దేశాలతో వీసా రహిత పర్యటనలపై రష్యా అంతర్ ప్రభుత్వ ఒప్పందాలను కూడా సిద్ధం చేస్తోందని ఇవనోవ్ చెప్పారంటూ టీఏఎస్ఎస్ చెప్పుకొచ్చింది.
కొవిడ్-19 మహమ్మారి కారణంగా రష్యా ఇ-వీసా పద్ధతిని కొంత కాలంగా ఆపివేసిన సంగతి అందరికీ తెలిసిందే.ఈ క్రమంలోనే దాన్ని ఇప్పుడు ప్రవేశ పెట్టాలని అనుకుంటోంది.అయితే పాశ్చాత్య దేశాల పర్యాటకులకు ఈ కొత్త సౌకర్యం అందిపుచ్చుకునే అవకాశం లేదు.ఎందుకంటే ఉక్రెయిన్‌పై సాగిస్తున్న యుద్ధం నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు రష్యాపై కఠిన ఆంక్షలు విధించాయి.
ఈ నేపథ్యంలోనే ఆయా దేశాల వారికి రష్యా టూరిస్ట్ ఇ వీసా సౌకర్యం కల్పించడం లేదు.ఇక పర్యాటకం పరంగా రష్యా ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన దేశాల్లో ఒకటని అందరికీ తెలిసిందే.