“హరికేన్”గా ఫేమస్ అయిన రికార్డు బ్రేకింగ్ రన్నర్ జూలియా హాకిన్స్, 108 సంవత్సరాల వయసులో లూసియానాలోని బాటన్ రూజ్‌లో అక్టోబర్ 22న తనువు చాలించారు.ఆమె తన 100వ ఏటే పరుగు ప్రారంభించి, 2017లో జరిగిన నేషనల్ సీనియర్ గేమ్స్‌లో పాపులర్ అయ్యారు.ఈ క్రీడల్లో 100 నుంచి 104 సంవత్సరాల(100 to 104 years) వయస్సు గల రన్నర్ల కోసం 100 మీటర్ల ప్రపంచ రికార్డును 39.62 సెకన్లలో పూర్తి చేసి ఆమె చరిత్ర సృష్టించారు.
105 సంవత్సరాలకు పైబడిన మొదటి మహిళగా ట్రాక్ రికార్డును సృష్టించి, సీనియర్ గేమ్స్‌లో, ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి స్ఫూర్తిగా నిలిచారు.ఆమె పరుగు ప్రయాణం 2016లో ఆమె కుమారులు ఆమెను లూసియానా సీనియర్ ఒలింపిక్స్‌లో(Louisiana Senior Olympics) 50 మీటర్ల పరుగులో పాల్గొనమని నమోదు చేయించినప్పుడు ప్రారంభమైంది.
ఆమె 19 సెకన్లలో పరుగు పూర్తి చేసింది, అందులో 100 సంవత్సరాలకు పైబడిన ఏకైక పార్టిసిపెంట్ ఆమె ఒక్కరే.ఇది ఆమెకు పరుగుపై అపారమైన ఆసక్తిని కలిగించి, దేశవ్యాప్తంగా పోటీపడి రికార్డులు సృష్టించేలా ప్రేరేపించింది.108 ఏళ్లు బతికిన ఆమె జీవితాంతం తనలాగా ఆరోగ్యంగా బతకడానికి కొన్ని సీక్రెట్ పాటించాలని చెప్పింది.ఆ లైఫ్ సీక్రెట్ సేవ చూద్దాం.
2019లో జూలియా, ఆరోగ్యంగా ఉండడానికి రహస్యం ఎప్పుడూ చురుగ్గా ఉండడమే అని వెల్లడించింది.మైండ్ ని ఎప్పుడు బిజీగా ఉంచుకోవాలని కొత్త విషయాలు నేర్చుకోవాలని తెలిపింది.జూలియా తన దీర్ఘాయువుకు కారణం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన రోజువారీ అలవాట్లు అని పేర్కొన్నది.ఆమె బాగా తింటూ, సరిపోయే నిద్ర పోతూ ఉండేది.
పొగ తాగడం లేదా మద్యం తాగడం వంటివి చేయదు.ఆమెకు ఇష్టమైన ఐస్‌డ్ కాఫీ, హాట్ టీ (Iced coffee, hot tea)కూడా చాలా అమితంగా తాగేది.
జూలియా కొత్త విషయాలను ప్రయత్నించడంలో నమ్మకం ఉంచేవారు.100 సంవత్సరాల వయసులో ఆమె 100 మీటర్ల పరుగును ప్రయత్నించాలని నిర్ణయించుకుని, దానికి అలవాటు పడిపోయారు.మన జీవితంలో మనకు గుర్తుండిపోయే కొన్ని ప్రత్యేక క్షణాలు, మనకు నచ్చిన కొన్ని అభిరుచులు ఉంటే జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది అని ఆమె నమ్మేవారు.తన భర్తతో కలిసి చేపలు పట్టడం, 50 ఏళ్ల వయసు నుంచి ప్రారంభించిన బోన్సాయ్ చెట్లను పెంచడం ఆమెకు చాలా ఇష్టమైన అభిరుచులు.
మంచి జీవిత భాగస్వామిని కనుగొనడం చాలా ముఖ్యమని జూలియా నమ్మేవారు.ఆమె భర్త ముర్రేతో దాదాపు 70 సంవత్సరాలు సుఖంగా జీవించింది.2013లో ఆయన మరణించారు.