భారతీయ సంగీతం ఎంతో ఉత్సాహం కలిగిస్తుంది.దీన్ని విన్నప్పుడు ఎవరైనా సరే డ్యాన్స్ చేయకుండా ఉండలేరు.
మన భారతీయులే కాదు, ప్రపంచం మొత్తం ఈ సంగీతానికి ఫిదా అవుతున్నారు.సోషల్ మీడియాలో ఇండియన్ పాటలకు విదేశీయులు(Foreigners) డాన్సులు చేస్తున్న వీడియోలు చాలానే ఉన్నాయి.
ఇటీవల ఇండియా గేట్ ముందు ఒక భారతీయ అమ్మాయి, ఒక అమెరికన్ అబ్బాయి కలిసి భోజ్‌పురి పాటకు చాలా సరదాగా డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.యూఎస్ వ్యక్తి మన ఇండియన్ అమ్మాయి డ్యాన్స్ స్టెప్పులను అచ్చంగా అనుకరిస్తూ ఎంతో ఆనందంగా ఉన్నట్లు కనిపించాడు.
వైరల్ అవుతున్న వీడియోలో సనమ్ అనే యువతి ఇండియా గేట్(India Gate) ముందు ఒక అమెరికన్ అబ్బాయితో కలిసి భోజ్‌పురి పాటకు (Bhojpuri Song)చాలా ఉత్సాహంగా డాన్స్ చేస్తుంది.సనమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో @sanam_dancer97 అనే పేరుతో చాలా ఫేమస్ అయింది.ఆమె తరచూ ఇండియా గేట్ ముందు విదేశీయులతో కలిసి డాన్స్ చేసి వీడియోలు చేస్తుంటుంది.ఈ వీడియోలో భోజ్‌పురి పాటకు సనమ్ చాలా ఎనర్జిటిక్‌గా డాన్స్ చేస్తుంటే, ఆ అమెరికన్ అబ్బాయి ఆమె స్టెప్పులను అనుకరిస్తూ చాలా ఆనందంగా ఉన్నట్లు కనిపిస్తున్నాడు.
సనమ్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన కొద్ది సేపటికే అది తెగ వైరల్ అయిపోయింది.ఈ వీడియోను 45 లక్షలకు పైగా మంది చూశారు.దీనికి 1.43 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి.కామెంట్లలో కూడా ఈ వీడియో గురించి చాలా చర్చ జరిగింది.కొంతమంది ఈ డాన్స్ చూసి చాలా ఫన్నీగా అనిపించిందని కామెంట్ చేశారు.“ఇది ఏ రకమైన డాన్స్? ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు” అని ఒకరు అంటే, “బిహారీలు విదేశీయులను కూడా డాన్స్ చేయిస్తున్నారే” అని మరొకరు ఫన్నీగా కామెంట్ చేశారు.“ఆ అమెరికన్ అబ్బాయి(American boy) ఇలాంటి అమ్మాయిని ఎక్కడ కనుక్కొన్నాడో” అని మరిన్ని కామెంట్లు వచ్చాయి.“అతనికి డాన్స్ చేయడం రావడం లేదు” అని కూడా కొందరు అన్నారు.