మీకు డ్రైవింగ్ లైసెన్స్ కావాలా అయితే జీన్స్ వేయకండి!

డ్రైవింగ్ లైసెన్స్ కావాలి అంటే జీన్స్ ఎందుకు వేయకూడదు అన్న ప్రశ్న మీ మదిలో మెదులుతుంది కదా.అదే సాధారణంగా డ్రైవింగ్ లైసెన్స్ కావలి అంటే 18 ఏళ్ల వయసు దాటి ఉండాలి అన్న ఒక్క కండీషన్ గురించి విన్నాం.

 Rto Denied A Woman For Driving Test Wearing Jeans-TeluguStop.com

కానీ ఇలా జీన్స్ ఎందుకు వేయకూడదు అన్న అనుమానం రాకమానదు.టెస్ట్ డ్రైవ్ కోసం వెళ్లిన ఒక యువతికి ఎదురైనా చేదు అనుభవం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వివరాల్లోకి వెళితే….చెన్నై కి చెందిన ఒక యువతి డ్రైవింగ్ టెస్ట్ కోసం కేకే నగర్ ఆర్టీఓ కార్యాలయం కి కొద్దీ రోజుల క్రితం వెళ్లింది.

అయితే టెస్ట్ డ్రైవ్ కోసం వారం రోజులుగా ఆ ఆఫీస్ కు వెళుతున్న ఆ యువతికి నిత్యం నిరాశే ఎదురైంది.ఎప్పటికప్పుడు అధికారులు టెస్ట్ డ్రైవ్ కు నిరాకరిస్తుండడం తో ఆ యువతి అసహనం కి గురై అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అంటూ ఆరా తీయడం ప్రారంభించింది.

అయితే అప్పుడే ఆ యువతికి అసలు విషయం తెలిసింది.ఇంతకీ ఆ యువతికి టెస్ట్ డ్రైవ్ కు అనుమతి రాకపోవడానికి అసలు కారణం ఆమె జీన్స్ ధరించడమేనట.

జీన్స్ ధరించినందుకే టెస్ట్ డ్రైవ్ అనుమతించలేదంటూ ఆర్టీఓ అధికారులు ఆ యువతికి బాంబు పేల్చారు.అంతేకాకుండా జీన్స్ ధరించి టెస్ట్ డ్రైవ్ కు వచ్చిన ప్రతి ఒక్క మహిళ పరిస్థితి కూడా అదేనని ఆ యువతికి తెలిసింది.

కేవలం టెస్ట్ డ్రైవ్‌లో సంప్రదాయ డ్రెస్సింగ్‌ ఉంటేనే అనుమతిస్తామని అధికారులు కూడా తేల్చి చెప్పేయడం తో ఆ యువతి అవాక్కయ్యింది.అధికారుల నిర్ణయం పై సదరు యువతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

అసలు ఇలాంటి రూల్ ఏంటని.లేని నిబంధనలను పెట్టి ఇబ్బందులకు గురిచేయడమేంటంటూ ఆ యువతి మండిపడింది.

అయితే ఒక్క ఆడవారికే కాదు మగవారికి కూడా ఆ కార్యాలయం కొన్ని షరతులు విధించింది.మగవారు లుంగీలు, షార్టులు ధరించి టెస్ట్ డ్రైవ్ కు రాకూడదు.

అదే విధంగా యువతులు స్లీవ్‌లెస్ డ్రెస్, జీన్స్‌లు ధరించి డ్రైవింగ్ టెస్టు కోసం వస్తే వారిని అనుమతించబోమని అధికారులు తేల్చి చెప్పారు.డ్రైవింగ్ టెస్టు కోసం ఆర్టీఓ కార్యాలయానికి వచ్చే వారు సంప్రదాయ దుస్తులు ధరించాలని సూచించారు.

Telugu Chennai, Drive Drive, Slive Jeans, Drive-

  అయితే లైసెన్స్‌ జారీ చేసే ఆర్టీఓ అధికారి మహిళల దుస్తులు సంప్రదాయబద్దంగా వుంటేనే లైసెన్స్‌ ఇవ్వాలని చేసిన ఆ అధికారుల ప్రయత్నాన్ని కొందరు అభినందిస్తున్నప్పటికీ కొందరు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.కేవలం 18 ఏళ్ల వయసు నిండితే చాలు అన్న రూలు వదిలేసి ఈ కొత్త కొత్త రూల్స్ ఏంటి, ఎవరి కంఫర్ట్ ను బట్టి వారు వస్త్రాలను ధరిస్తారు అంటూ కొందరు వాదనకు దిగుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube