ఆర్ఆర్ఆర్ మూవీలో ఇంగ్లీష్ పాట.. వారి కోసమేనా..?

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి నిన్న అధికారికంగా ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే.ఈ ఏడాది అక్టోబర్ నెల 13వ తేదీన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల కానుంది.

 Rrr To Have A English Song To Thumping Score With  International Effect, Ram Cha-TeluguStop.com

అన్ని భాషల్లో అదే రోజు ఈ సినిమా విడుదల కానుండటంతో ఈ సినిమా రిలీజ్ డేట్ ను బట్టి మిగతా సినిమాలు తమ రిలీజ్ డేట్ లను మార్చుకుంటున్నాయి.

అయితే ఈ సినిమాలో మొత్తం ఐదు పాటలు ఉంటాయని ఆ పాటలలో ఒకటి ఇంగ్లీష్ పాట కూడా ఉంటుందని తెలుస్తోంది.

ఆర్ఆర్ఆర్ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ కు జోడీగా హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ నటిస్తున్న సంగతి తెలిసిందే.వీళ్లిద్దరి మధ్యలో ఈ ఇంగ్లీష్ పాటను తెరకెక్కించనున్నారని సమాచారం.

ఇంటర్నేషనల్ లెవెల్ లో ప్రేక్షకులను ఆకర్షించాలనే ఉద్దేశంతో రాజమౌళి ఇంగ్లీష్ పాట ఉండేలా ప్లాన్ చేశారని సమాచారం.

Telugu Alia Bhatt, English, Mm Keeravani, Olivia Morris, Rajamouli, Ram Charan,

మిగిలిన నాలుగు పాటల్లో మాత్రం ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి కనిపిస్తారని తెలుస్తోంది.హాలీవుడ్ రేంజులో ఈ సినిమాకు భారీ మొత్తంలో కలెక్షన్లు రావాలని రాజమౌళి ఈ ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది.మరోవైపు ఈ సినిమా నేపథ్య సంగీతం విషయంలో కూడా కీరవాణి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం.

బాహుబలి సిరీస్ సినిమాలకు సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సంగతి తెలిసిందే.

అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ పాత్రలను తీసుకుని ఫిక్షనల్ కథతో రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన రెండు టీజర్లు పాజిటివ్ రెస్పాన్స్ అందుకోగా హీరోయిన్లకు సంబంధించిన టీజర్లు వీడుదల కావాల్సి ఉంది.అలియాభట్ ఈ సినిమాలో సీత పాత్రలో నటిస్తుండగా ఒలీవియా మోరిస్ ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో నటిస్తున్నారో తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube