ఆర్ఆర్ఆర్ మూవీ బాక్సాఫీస్ వద్ద సృష్టిస్తున్న సంచలనాలు అన్నీఇన్నీ కావు.ఇప్పటివరకు ఈ సినిమాకు 1,000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.
నైజాం ఏరియాలో ఈ సినిమా 100 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించి ఆశ్చర్యానికి గురి చేసిన సంగతి తెలిసిందే.అయితే ఆర్ఆర్ఆర్ నైజాం లెక్కల వెనుక అసలు కథ వేరే ఉందని తెలుస్తోంది.
సాధారణంగా పెద్ద సినిమాలు నైజాం ఏరియాలో 40 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు సాధించడం సులువు కాదు.
అయితే ఆర్ఆర్ఆర్ నైజాంలో ఏకంగా 103 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించిందని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు.
అయితే ఆర్ఆర్ఆర్ 103 కోట్ల రూపాయలు సాధించడం వాస్తవమే అయినా ఆ కలెక్షన్లు నెట్ కలెక్షన్లు అని తెలుస్తోంది.ఆర్ఆర్ఆర్ మూవీ నైజాం షేర్ కలెక్షన్లు 87 కోట్ల రూపాయలు మాత్రమే అని సమాచారం.
నైజాం ఏరియాలో ఆర్ఆర్ఆర్ నెట్ కలెక్షన్లు షేర్ కలెక్షన్లుగా ప్రచారంలోకి రావడంతో చాలామంది కలెక్షన్ల విషయంలో పొరపాటు పడుతున్నారు.
అయితే నైజాంలో 87 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు సాధించడం సులువైన విషయం కాదు.

నైజాంలో ప్రముఖ నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించారు.ఆర్ఆర్ఆర్ ఫుల్ రన్ లో దిల్ రాజుకు 20 కోట్ల రూపాయల లాభాలను అందించే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.నిర్మాత దానయ్యకు కూడా ఈ సినిమా ద్వారా అంచనాలకు మించి లాభాలు వచ్చాయి.

ఆర్ఆర్ఆర్ మూవీ దాదాపుగా అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ అయింది.దర్శకుడు రాజమౌళికి కూడా ఈ సినిమా ద్వారా ఊహించని స్థాయిలో లాభాలు వచ్చాయి.ఆర్ఆర్ఆర్ సంచలన విజయం చరణ్, తారక్ కెరీర్ కు ప్లస్ కావడంతో పాటు ఇద్దరు హీరోల మార్కెట్ పెరగడానికి కారణమైంది.
ఈ ఇద్దరు హీరోలకు క్రేజ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది.