ఆర్ఆర్ఆర్ మూవీ బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి కలెక్షన్లను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 380 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించిన ఆర్ఆర్ఆర్ పలు ఏరియాల్లో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయిందని సమాచారం అందుతోంది.
ఈ వీకెండ్ నాటికి ఈ సినిమా 500 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం గ్యారంటీ అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఆర్ఆర్ఆర్ మూవీ చూసిన ప్రేక్షకులు ఆ సినిమాలో మల్లి, మల్లి తల్లి పాత్రలను సులువుగా మరిచిపోలేరు.
జక్కన్న ఎంతోమందిని ఆడిషన్ చేసి వీళ్లను ఎంపిక చేశారు.మల్లి అసలు పేరు ట్వింకిల్ శర్మ కాగా మల్లి తల్లి పాత్రలో నటించిన నటి పేరు అహ్మరీన్ అంజుమ్ కావడం గమనార్హం.
తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోయినా ఆర్ఆర్ఆర్ సక్సెస్ తో అహ్మరీన్ అంజుమ్ కు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.
మల్టీ టాలెంటెడ్ నటి అయిన అంజుమ్ కు నటనతో పాటు డైరెక్షన్, ఎడిటింగ్, ఇతర విభాగాలలో పట్టు ఉంది.తెలుగమ్మాయి కాకపోయినా అంజుమ్ తెలుగులో అనర్గళంగా మాట్లాడగలదు.అహ్మరీన్ అంజుమ్ కోల్ కతాకు చెందిన యువతి కాగా ప్రస్తుతం ఈమె ముంబైలో నివశిస్తున్నారని తెలుస్తోంది.
పది సంవత్సరాలకు పైగా ఈ నటికి నటనలో అనుభవం ఉందని తెలుస్తోంది.హిందీలో అంజుమ్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్, యాడ్స్ లో నటించారు.
ఆర్ఆర్ఆర్ సినిమాలో అంజుమ్ పాత్ర నిడివి తక్కువైనా తన నటనతో ఈ నటి మెప్పించారు.ఆర్ఆర్ఆర్ మూవీ సక్సెస్ సాధించడంతో అంజుమ్ ఎంతో సంతోషిస్తున్నారు.
క్లాస్ ఆఫ్ 83లో ఆమె నటన అద్భుతంగా ఉండటంతో జక్కన్న ఆర్ఆర్ఆర్ మూవీలో ఆమెకు ఛాన్స్ ఇచ్చారు.అంజుమ్ నటించిన జల్ దావన్ అనే లఘు చిత్రానికి ఎన్నో అవార్డులు వచ్చాయి.
సర్ అనే సినిమాలో అంజుమ్ దేవిక అనే పాత్రను పోషించగా క్రిటిక్స్ సైతం ఆమెను ప్రశంసించడం గమనార్హం.