ఆర్‌ఆర్ఆర్‌ లో అల్లూరి, భీమ్‌ లు కనిపించేది ఎంత సమయమో తెలుసా!

రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల అవ్వబోతుంది.

 Rrr Movie Interesting Update Rrr, Movie , Update, Ram Charan , Rajamouli , Jr Nt-TeluguStop.com

సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాత కూడా ఇంకా విజువల్ ఎఫెక్ట్స్ వర్క్‌ జరుగుతూనే ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.ఒక వైపు టికెట్ల రేట్ల ఇష్యూ మరియు కరోనా కొత్త వేరియంట్‌ థర్డ్‌ వేవ్‌ ఇలా అనేక రకాలుగా ఇబ్బందులు ఉన్నా కూడా ఖచ్చితంగా ఆర్ ఆర్ ఆర్‌ ను విడుదల చేస్తామని చెబుతున్నారు.

ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది.కనుక ఈ సినిమా ను వాయిదా వేయడం లేదు అంటూ మేకర్స్ చెప్పుకొచ్చారు.

ఇక ఈ సినిమా లో మరిన్ని విషయాలను ప్రేక్షకులకు సంభ్రమాశ్చర్యంను కలిగిస్తాయని అంటున్నారు.ఇక ఈ సినిమా లో రామ్‌ చరణ్‌ పోలీసుగా ఎన్టీఆర్‌ ఒక విప్లవ నాయకుడిగా కనిపించబోతున్నారు.

అయితే వీరు మన్యం వీరుడు అల్లూరిగా మరియు గోండు బెబ్బులి కొమురం భీమ్‌ గా కూడా కనిపించబోతున్నారు.ఆ లుక్ లో వీరిద్దరు కనిపించినప్పుడు ప్రేక్షకులు లేచి మరీ నిల్చుని చప్పట్లు కొడతారు అంటున్నారు.

ఖచ్చితంగా ఆ సన్నివేశాలు సినిమా కు హైలైట్‌ అవుతాయని మేకర్స్‌ చెబుతున్నారు.కాని విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా లో ఇద్దరు హీరో లు ఆ లుక్ లో కేవలం పది నిమిషాలు మాత్రమే కనిపిస్తారట.

Telugu Rajamouli, Ram Charan, Rrr-Movie

సినిమా క్లైమాక్స్ లో ఫైటింగ్ సన్నివేశంలో మాత్రమే ఆ గెటప్స్ లో కనిపిస్తారని అంటున్నారు.కేవలం యాక్షన్‌ సన్నివేశాల వరకే అది పరిమితం అవ్వబోతుందని తెలుస్తోంది.ప్రేక్షకులు ఆ గెటప్స్ కోసం ఖచ్చితంగా ఎదురు చూసే విధంగా సన్నివేశం ఉంటుందని అంటున్నారు.రాజమౌళి మ్యాజిక్ ఏంటి అనేది అక్కడ తెలియనుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube