నెల్లూరు జిల్లాలో మళ్లీ కుళ్లిన చికెన్ కలకలం సృష్టిస్తోంది.ఈ క్రమంలో చికెన్ సెంటర్లపై హెల్త్ ఆఫీసర్స్ దాడులు నిర్వహించారు.
వెంకటేశ్వరపురంలోని ఓ చికెన్ సెంటర్ లో కుళ్లిన మాంసంను అధికారులు గుర్తించారు.సుమారు వంద కేజీల చికెన్, కోడి వ్యర్థాలను డంపింగ్ యార్డుకు తరలించారు.
అనంతరం హెల్త్ ఆఫీసర్స్ చికెన్ సెంటర్ ను సీజ్ చేశారు.కాగా ఈ మాంసం చెన్నై, చిత్తూరు నుంచి తీసుకొచ్చినట్లు అధికారులు గుర్తించారు.