వజ్రకరూరు మండలం పీసీ ప్యాపిలి దగ్గర విషాదం చోటుచేసుకుంది.పెళ్లి కార్డులు ఇచ్చేందుకు వెళ్లిన పెళ్లికూతురు ప్రమాదవశాత్తూ మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.
తన పెళ్లికి బంధువులను ఆహ్వానించి ద్విచక్ర వాహనంపై తిరిగి వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది.పూర్తీ వివరాల్లోకి వెళ్తే.
అనంతపురం జిల్లాకి చెందిన పర్వీన్కి వివాహం నిశ్చయమైంది.వచ్చే నెల ఏడో తేదీన పెళ్లి జరగనుంది.అమ్మాయికి పెళ్లి అనేది ఒక్క కళ.ఎన్నో ఆశలతో తన కొత్త జీవితాన్ని గడపాలని కలలు కంటూ ఉంటారు.అయినా ఆడంబరంగా చేసుకోవాలని ఎవరికీ ఉండదు.పెళ్లి కూతురు తన పెళ్లికి బంధువులు, స్నేహితులను ఆహ్వానించేందుకు వెళ్ళింది.అందరికి పెళ్లి కార్డులు అందజేసి వారు తిరిగి స్వగ్రామానికి ప్రయాణమైయ్యారు.కానీ కాబోయే వధువు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.
ఇంతలో కారు రూపంలో మృత్యువు ఆమె కబళించింది.
సోదరుడు చాంద్బాషాతో కలసి బైక్పై వెళ్తుండగా వజ్రకరూరు మండలం పీసీ ప్యాపిలి వద్ద కారు ఢీ కొట్టింది.
దింతో బైక్పై వారు నుంచి కిందపడిపోయారు.ఈ ఘటనలో పర్వీన్కి తీవ్రగాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
బైక్ నడుపుతున్న తమ్ముడు చాంద్బాషాకి గాయాలవడంతో అనంతపురం ఆస్పత్రికి తరలించారు.స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.
తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.మృతదేహాన్ని పోస్టుమార్టు నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
కొద్దిరోజుల్లో పెళ్లిపీటలెక్కాల్సిన కూతురు విగతజీవిగా కనిపించడంతో ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.