ప్రియుడికి బ్రేకప్ చెప్పిన జబర్దస్త్ ఫేమ్ రీతూ చౌదరి.. లవ్వుకో దండం అని చెబుతూ?

జబర్దస్త్ షో( Jabardasth Show ) ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న వాళ్లలో రీతూ చౌదరి( Ritu Choudhary ) ఒకరు కాగా ఆమెను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతున్న సంగతి తెలిసిందే.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రీతూ చౌదరి తాజాగా షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి.

 Rithu Choudary Break Up Details Here Goes Viral In Social Media , Rithu Choudar-TeluguStop.com

యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా రీతూ చౌదరి భారీగానే సంపాదిస్తున్నారని తెలుస్తోంది.

కొంతకాలం క్రితం రీతూ చౌదరి ప్రేమలో పడ్డారని వార్తలు ప్రచారంలోకి రాగా ఆ వార్తలు తెగ వైరల్ అయ్యాయి.

శ్రీకాంత్ ( Srikanth )అనే వ్యక్తితో రీతూ చౌదరి దిగిన ఫోటోలు వైరల్ కాగా ఈ బంధం కంటే ఏదీ గొప్పది కాదంటూ ఆమె కామెంట్లు చేయడంతో శ్రీకాంత్ రీతూ చౌదరి ప్రేమలో ఉన్నారని కామెంట్లు వ్యక్తమయ్యాయి.రీతూ నుదుటిపై శ్రీకాంత్ ముద్దు పెట్టిన వీడియో కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అయింది.

అయితే తర్వాత రోజుల్లో రీతూ చౌదరి సోషల్ మీడియాలో శ్రీకాంత్ ఫోటోలను డిలీట్ చేయడం జరిగింది.తాజాగా నిజాలు మాట్లాడుకుందాం అంటూ అభిమానులతో ముచ్చటించిన రీతూ చౌదరి పెళ్లెప్పుడు అనే ప్రశ్నకు పెళ్లి చేసుకోకపోవడమే మంచిదని సమాధానమిచ్చారు.శ్రీకాంత్ తో మాట్లాడటం లేదా అనే ప్రశ్నకు లేదంటూ ఆమె బదులిచ్చారు.ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారా అనే ప్రశ్నకు ప్రేమకో దండం అంటూ రీతూ చౌదరి పేర్కొన్నారు.

నేను నాతో మాత్రమే ప్రేమలో ఉన్నానని ఆమె కామెంట్ చేశారు.తన కామెంట్ల ద్వారా రీతూ చౌదరి బ్రేకప్ నిజమేనని క్లారిటీ వచ్చింది.రీతూ చౌదరి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.రీతూ చౌదరిని అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది.సోషల్ మీడియాలో రీతూ చౌదరికి క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube