రైస్ పేపర్ పానీ పూరీని ఎప్పుడైనా చూశారా.. వైరల్ అవుతున్న వీడియో..

పానీ పూరీ( Panipuri ) బండి కనిపిస్తే చాలు ఆగిపోయి వాటిని లొట్టలు వేసుకొని తినేవారు చాలామంది ఉన్నారు.ఈ పాపులర్ ఇండియన్ స్ట్రీట్ ఫుడ్‌ను దేశవ్యాప్తంగా విభిన్న పేర్లు మరియు వైవిధ్యాలను కలిగి ఉంది.

 Rice Paper Pani Puri Recipe Impressed Foodies Viral Video Details, Viral Video,-TeluguStop.com

ఈ ఐటమ్ లో గోధుమ పిండి లేదా రవ్వతో చేసిన క్రిస్పీ బంతులను( Crispy Balls ) కలిగి ఉంటుంది, అందులో బంగాళాదుంపలు, బఠానీలు ఇంకా తదితర మసాలా వాటర్ యాడ్ చేసి ఇస్తారు.క్రంచీ, స్పైసీ, టాంగీ, తాజా రుచుల కలయికతో ఈ స్ట్రీట్ ఫుడ్ అద్భుతంగా ఉంటుంది.

వీటిని తిన్నా కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది.

అయితే ఠాకూర్ సిస్టర్స్ అనే పేరు గల ఒక ఇన్‌స్టాగ్రామ్ యూజర్, పానీ పూరీని కొత్తగా తయారు చేసింది.

ఆ కొత్త పానీ పూరీకి తయారీకి సంబంధించిన వీడియోను షేర్ చేసింది.ఆమె బాల్స్ చేయడానికి సాధారణ పిండికి బదులుగా రైస్ పేపర్‌ను( Rice Paper ) ఉపయోగించింది.

రైస్ పేపర్ అనేది బియ్యం పిండి, నీరు, ఉప్పుతో తయారు చేయబడిన సన్నని తినదగిన షీట్, సాధారణంగా స్ప్రింగ్ రోల్స్ లేదా కుడుములు చుట్టడానికి ఆసియా వంటకాల్లో ఉపయోగిస్తారు.

వీడియోలో, ఫుడ్ బ్లాగర్ ఆమె తడి బియ్యం కాగితాల నుంచి వృత్తాలను ఎలా కత్తిరించి, అవి ఉబ్బెంత వరకు వాటిని గాలిలో ఎలా వేయించిందో చూపించింది.ఆమె ప్రతి బంతికి ఒక చిన్న రంధ్రం చేసి, వాటిని మెత్తని బంగాళాదుంపలు,( Potatoes ) ప్రత్యేక మసాలా నీటితో( Spicy Water ) నింపింది.ఆమె వాటిలో ఒకదానిని రుచి చూసి ఆనందిస్తున్నట్లు అనిపించింది.

ఈ వీడియో చూసి నెటిజన్లు కూడా నోరూరుతోందని కామెంట్ చేస్తున్నారు.వీటిని తాము కూడా ట్రై చేస్తామని మరికొందరు పేర్కొన్నారు.

ఆమె వీడియోకు “రైస్ పేపర్ గోల్ గప్పే: రైస్ పేపర్ ఛాలెంజ్ 4/30వ రోజు!” అని క్యాప్షన్ ఇచ్చింది.కొద్ది రోజుల కిందట పోస్ట్ చేసిన ఈ వీడియోకు వ్యూయర్ల నుంచి 56,000 కంటే ఎక్కువ లైక్‌లు, అనేక కామెంట్స్ వచ్చాయి.వారిలో కొందరు ఫుడ్ బ్లాగర్‌ని ప్రశంసించారు, మరికొందరు సాంప్రదాయ పానీ పూరీ పట్ల తమ అసంతృప్తిని, ప్రాధాన్యతను వ్యక్తం చేశారు.కొందరు రైస్ పేపర్‌తో చేయగలిగే ఇతర వంటకాలను కూడా సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube