టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పిన తక్కువే.ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోగా నిలిచాడు పవన్.
ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకున్నాడు.ఇక ప్రస్తుతం ఓవైపు సినిమాలనే కాకుండా మరోవైపు రాజకీయాల వైపు కూడా బాధ్యతలు చేపట్టాడు.
ఇక ఈయన వ్యక్తిగత విషయానికి వస్తే.తనతో కలిసి నటించిన రేణు దేశాయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
కానీ కొంతకాలానికే వీరిద్దరూ విడిపోయారు.వీరికి అకీరా నందన్, ఆద్య అనే ఇద్దరు పిల్లలు కూడా ఉండగా ఆ పిల్లల బాధ్యతలు మొత్తం రేణు దేశాయ్ చూసుకుంటుంది.
రేణు దేశాయ్ పవన్ తో కలిసి బద్రి, జానీ సినిమాలో నటించింది.ఈమె సినిమాల్లోకి అడుగు పెట్టక ముందు మోడల్ గా, కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసింది.
ఆ తర్వాత హీరోయిన్ గా అడుగు పెట్టింది.
అలా పవన్ కళ్యాణ్ తో రెండు సినిమాలలో చేసింది.
ఆ సమయంలో వీరి మధ్య ప్రేమ పుట్టగా పెళ్లికి ముందే అకీరాకు జన్మనిచ్చింది.ఆ తర్వాత పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.
ఇక రేణు దేశాయ్ పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది.ఆ తర్వాత కొంతకాలానికి ఆద్య పుట్టింది.
అలా తమ జీవితం హ్యాపీగా గడుస్తున్న సమయంలో వారిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి.దీంతో వారిద్దరి మధ్య విడాకులు కూడా జరిగాయి.
ఇక అప్పటి నుంచి తన పిల్లల బాధ్యత తనే చూసుకుంటుంది రేణు.గత కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా మారింది రేణు దేశాయ్.
ఆ మధ్య బుల్లితెరపై ఢీ డ్రామా జూనియర్స్ లో జడ్జిగా కొంతకాలం చేసింది.ఆ తర్వాత బుల్లితెరకు కూడా దూరంగా ఉండగా కేవలం సోషల్ మీడియా ద్వారా మాత్రమే అందరికీ టచ్ లో ఉంటుంది.
ఇప్పటికీ పవన్ కళ్యాణ్ అభిమానులు రేణు దేశాయ్ కు మంచి గౌరవం ఇస్తూ ఉంటారు.పవన్ కూడా తన పిల్లల బాధ్యతలను అసలు వదలలేదు.ఇక వీరిద్దరూ తమ పిల్లల కోసం అమ్మానాన్నలుగా మాత్రం ఉన్నారని చెప్పవచ్చు.పవన్ కళ్యాణ్ అభిమానులు అకీరా, ఆద్యలని చూసి బాగా మురిసిపోతుంటారు.వారు ఏ మంచి పని చేసిన ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు.
ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రేణు ప్రతిసారి తన పిల్లలకు సంబంధించిన విషయాలను పంచుకుంటూ ఉంటుంది.
సమయం దొరికితే తన పిల్లలతో కలిసి ట్రిప్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా ఆమె ఒక వీడియో షేర్ చేసుకుంది.అందులో తామంతా కలిసి ట్రిప్ లో ఉన్నట్లు తెలుస్తుంది.
ఇక వాళ్ళు మంచు ఉన్న చోట కారులో ప్రయాణిస్తూ కనిపించగా అందులో ఆద్య బయటికి చూస్తూ ఆ వాతావరణంను బాగా ఆస్వాదిస్తూ కనిపించింది.దీంతో ఆ వీడియో షేర్ చేసిన రేణు.తన కూతురుకు పక్కనే ఉన్న మంచు లోకి కారులో నుండి జంప్ చేయాలని ఉందని తెలిపింది.
ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుంది.