Aadhya : “పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్” కూతురు ఆధ్యా అచ్చం ఎవరి పోలిక అంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan )… ఈమాట చెబితే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఆనందం ఉప్పొంగుతుంది.అతనికి ఇక్కడ ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవలసిన పనిలేదు.

 Renu Desai Daughter Looks Alike-TeluguStop.com

కంటెంట్ వున్నోడి కటౌట్ చాలు అని ఒక సినిమాలోని డైలాగ్.అది కూడా మన పవన్ ని వుద్దేశించి రాసినదే… అది వేరే విషయం.

ఒకవైపు సినిమాల్లోనూ మరోవైపు రాజకీయాల్లోనూ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం మొత్తం మీద ఆయనకి ఎనలేని క్రేజ్ వచ్చింది.పవర్ స్టార్ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు ఆరోజు అభిమానులకు పండగే.

పవన్ కళ్యాణ్ ని సినిమాల తో పాటు వ్యక్తిగతంగా అభిమానించే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది.

Telugu Aadhya, Akira Nandan, Anjana Devi, Pawan Kalyan, Renu Desai, Tollywood-Mo

ఈ క్రమంలో జనాలు పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులను కూడా అదే విధంగా ఆదరిస్తూ వుండడం మనం చూడవచ్చు.ఎక్కువ రాజకీయ జీవితంలో ప్రజల మధ్య ఉండే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని అస్సలు బయటికి రానివ్వరు.అప్పుడప్పుడు తన పిల్లలతో ఫ్యామిలీ ఫంక్షన్స్ లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వస్తాయి తప్ప అతనికి అతనుగా ఎప్పుడు కూడా బయట కుటుంబంతో కనబడిన దాఖలాలు తక్కువనే చెప్పుకోవాలి.

పవన్ కళ్యాణ్ కి తన రెండో భార్య రేణు దేశాయికి పుట్టిన అకిరా, ఆద్యాలు ఇప్పటికే ఫాన్స్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న విషయం అందరికీ తెలిసినదే.అకిరా( Akira Nandan ) కటౌట్ చూసి పవన్ కళ్యాణ్ కి వారసుడు వచ్చాడని జనాలు పండగ చేసుకుంటున్న పరిస్థితి వుంది.

Telugu Aadhya, Akira Nandan, Anjana Devi, Pawan Kalyan, Renu Desai, Tollywood-Mo

ఈ క్రమంలోనే ప్రస్తుతం అకిరా యాక్టింగ్ లోను, డాన్సుల్లోనూ, మార్షల్ ఆర్ట్స్ లోను ట్రైనింగ్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.ఇక పవన్ కళ్యాణ్ కుమార్తె ఆధ్య కూడా తాజాగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.చాలాకాలం తర్వాత రేణు దేశాయ్ నటించిన టైగర్ నాగేశ్వరరావు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తన తల్లి తో పాటు ఆద్య కూడా హాజరైంది.ఇక్కడ మొత్తం ఈవెంట్ కి ఆమె సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది.

చాలాకాలం తర్వాత ఆద్యను చూసిన అభిమానులు అచ్చం పవన్ కళ్యాణ్ తల్లి అంజన దేవి( Anjana Devi )లా వుందని ఆనందపడుతున్నారు.ఇద్దరి ఫోటోలను పక్కపక్కన పెట్టుకుని కంపేరిజన్లు కూడా మొదలు పెట్టేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube