జియోసినిమా యూజర్లకు షాక్.. ఇకపై మనీ కట్టాల్సిందే!

దేశీయ టెలికాం, డిజిటల్ సేవల సంస్థ రిలయన్స్ జియో( Reliance Jio ) తన జియోసినిమా ప్లాట్‌ఫామ్‌ ద్వారా FIFA ప్రపంచ కప్, IPL వంటి పాపులర్ స్పోర్ట్స్ ఈవెంట్‌లను ఫ్రీగా టెలికాస్ట్ చేస్తోంది.దాంతో దీని యూజర్ బేస్ విపరీతంగా పెరిగింది.

 Reliances Jiocinema Said To Start Charging For Content After The End Of Ipl,reli-TeluguStop.com

అయితే, ఈ కంపెనీ తన జియో సినిమా ఓటీటీ యాప్‌( Jio Cinema )లో 100కి పైగా సినిమాలు, సిరీస్‌లు యాడ్ చేయాలని ప్లాన్ చేసింది.వీటికి యాక్సెస్ కోసం ఛార్జీలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.

రిలయన్స్‌లోని మీడియా & కంటెంట్ బిజినెస్ ప్రెసిడెంట్ జ్యోతి దేశ్‌పాండే( Jyoti Deshpande ) బ్లూమ్‌బెర్గ్‌ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కొత్త కంటెంట్ కోసం పైసలు వసూలు చేయనున్నట్లు.IPL 2023 ముగిసేలోపు ఛార్జ్ చేయడం మొదలు పెట్టనున్నట్లు చెప్పారు.

కొత్త సినిమాలు, సిరీస్‌ల కోసం యూజర్లు మనీ చెల్లించాల్సి ఉండగా, వారు ఇప్పటికీ జియోసినిమాలో IPL మ్యాచ్‌లను ఉచితంగా చూడగలరు.రిలయన్స్ జియో ప్రత్యర్థి ఎయిర్‌టెల్( Airtel ) డిఫరెన్షియల్ ధరల గురించి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాతో ఆందోళన వ్యక్తం చేసింది.ఎందుకంటే డిస్నీ-స్టార్ IPLకి యాక్సెస్ కోసం రూ.19 వసూలు చేస్తుంది, అయితే జియోసినిమా దీన్ని ఉచితంగా ప్రసారం చేస్తుంది.ఇలాంటి ధరల వ్యత్యాసాలను నివారించడానికి ఎయిర్‌టెల్ ఒక-సేవ-ఒక-రేటుకు పిలుపునిచ్చింది.

రిలయన్స్ జియో IPL ఉచిత స్ట్రీమింగ్‌( Jio IPL Free Streaming )తో చాలా పాపులర్ అయింది.డిస్నీ-స్టార్ టోర్నమెంట్‌కు యాక్సెస్ కోసం ఛార్జీలు వసూలు చేసినప్పటికీ, అది దాని 20 ఛానెల్‌ల ద్వారా మిలియన్ల మంది వీక్షకులను ఆకర్షిస్తోంది.మరి జియో సినిమాలో కొత్తగా రానున్న సినిమాలు ఏంటనేది ఆసక్తికరంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube