Reliance Ambani : యావత్ దేశంలోనే బడా టెలికాం దిగ్గజంగా రిలయన్స్‌ జియో రికార్డు.. నిదర్శనం ఇదే!

ప్రముఖ దేశీయ దిగ్గజ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో రికార్డులమీద రికార్డులు సాధిస్తోంది.తాజాగా యావత్ భారతదేశంలోనే అత్యంత బలమైన టెలికాం సర్వీస్ ప్రొవైడర్ గా రిలయన్స్ జియో అవతరించింది.

 Reliance Jio's Record As The Biggest Telecom Giant In The Country This Is The Pr-TeluguStop.com

ఈ విషయమై ప్రముఖ డేటా అనాలిసిస్ కంపెనీ ట్రాయ్‌ నివేదించింది.ఇండియాస్ మోస్ట్ డిజైరబుల్ బ్రాండ్స్ 2022 జాబితాలో రిలయన్స్‌ జియోకి ఈ ర్యాంక్ లభించింది.

ఇక ఆ తర్వాత భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా లిమిటెడ్, BSNL స్థానాలు సంపాదించుకున్నాయి.

అలాగే బట్టల విభాగంలో ‘అడిడాస్’ టాప్ బ్రాండ్‌గా ఇక్కడ స్థానం దక్కించుకుంది.

ఆ తర్వాత నాయక్, అలాన్ సోలీ, రేమండ్, పీటర్ ఇంగ్లండ్ బ్రాండ్లు స్థానాన్ని దక్కించుకున్నాయి.అదే విధంగా వాహనాల జాబితాలో BMW అగ్రస్థానంలో ఉండగా, హ్యుందాయ్, టయోటా, హోండా తర్వాతి స్థానాన్ని కైవసం చేసుకున్నాయి.

బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్‌లో LIC మొదటి స్థానంలో ఉండగా, దీని తర్వాత SBI (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) 2వ స్థానంలో, ICICI బ్యాంక్ 3వ స్థానంలో ఉండటం గమనార్హం.ఇక ఎలక్ట్రానిక్స్ విభాగంలో LG, శాంసంగ్, సోనీ మొదటి మూడు బ్రాండ్‌లుగా వెలుగొందుతున్నాయి.

Telugu Ambani, Company, Reliance Jio, Telecom-Latest News - Telugu

వివిధ గ్రూపుల జాబితా విషయానికొస్తే, ITC అగ్రస్థానంలో ఉండగా, టాటా, రిలయన్స్‌లు తరువాతి ర్యాంక్‌లో వున్నాయి.పవర్ కేటగిరీలో విషయానికొస్తే… HPCL (హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్) అగ్రస్థానంలో ఉండగా, IOC (ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్), అదానీ గ్రూప్ తర్వాతి స్థానాల్లో ఉండటం విశేషం.అలాగే ఆహారం, పానీయాల విభాగంలో అమూల్ బ్రాండ్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.ఆ తరువాత లాక్మే, నివియా, కోల్‌గేట్ ఉన్నాయి.ఇంటర్నెట్ బ్రాండ్‌ల జాబితాలో అమెజాన్, ఫేస్‌బుక్, ఫ్లిప్‌కార్ట్, గూగుల్ అగ్రస్థానంలో ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube