తెలంగాణలో గత వారం రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.ఇదే తరహాలో రేపు కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది.
ఈ మేరకు పలు జిల్లాలను అప్రమత్తం చేసిన వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.ఇందులో భాగంగా ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ మరియు కామారెడ్డి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
ఈ క్రమంలో రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.అదేవిధంగా నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలతో పాటు హైదరాబాద్ కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
ఈ నేపథ్యంలో ప్రజలు అంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని తెలిపారు.