సమ్మర్ సీజన్ మొదలవడమే ఆలస్యం ఎండలు దంచికొడుతున్నాయి.ఏప్రిల్ మిడ్ మంత్ టైం లో తెలంగాణా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి.
ఉదయం 10 గంటల నుంచి ఉష్ణోగ్రత( Temperature ) అధికంగా ఉంటుంది.తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా ఏడు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ ( Department of Meteorology )వెల్లడించింది.
నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండతో పాటుగా మిగతా కొన్ని రాష్ట్రాల్లో 44 డిగ్రీల కన్నా అధిక ఉష్ణోగ్రత ఉంటుందని చెప్పారు.నిర్మల్ జిల్లాలో సోమవారం అత్యధికంగా 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
నల్గొండ, ఆసీఫాబాద్ జిల్లాల్లో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది.ఆదివారం రాష్ట్రంలో దాదాపు 18 జిల్లాల్లో 41 డిగ్రీల ఉష్ణోగ్రత ఏర్పడింది.
అయితే 22 వరకు రాష్టంలో కొన్నిచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.రంగారెడ్డి, హైదరాబాద్, రాజన్న సిరిసిల్ల, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మదక్, కామా రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాల్లో వర్షాలు ఉండొచ్చని వెదర్ రిపోర్ట్ ఇచ్చారు.
తెలంగాణాలో కొన్ని చోట్ల అధిక ఉష్ణోగ్రత కొన్ని ఏరియాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో వర్షాలు.దీని వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఏప్రిల్ లోనే ఇలా ఉంటే ఈసారి మేలో ఎండలు మరింత ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ చెబుతుంది.