టాలీవుడ్ హీరో మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం వరుస నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
క్రాక్ సినిమాతో మంచి హిట్ టాక్ ను అందుకున్న రవితేజ ఆ తర్వాత ఖిలాడీ సినిమాతో పేక్షకులను పలకరించాడు.ఈ సినిమా విడుదల అయ్యే పరవాలేదు అనిపించింది.
ఆ తర్వాత రామారావు ఆన్ డ్యూటీ సినిమా విడుదల అయ్యి ఊహించని విధంగా పరాజయం పాలయ్యింది.అయితే ఖిలాడి,రామా రావు ఆన్ డ్యూటీ రెండు సినిమాలు కూడా అంతగా సక్సెస్ ను తెచ్చి పెట్టలేకపోయాయి.
దీంతో రవితేజ తన తదుపరి సినిమాలపై దృష్టి ని పెట్టాడు.
ఇకపోతే ప్రస్తుతం రవితేజ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో వస్తున్న ధమాకా సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
టాలీవుడ్‌లో తన అందచందాలతో కుర్రకారును ఒక ఊపు ఊపుతున్న యంగ్ హీరోయిన్ శ్రీలీల రవితేజ సరసన నటిస్తోంది.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకు టీజర్లకు పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.
మరి ముఖ్యంగా ఈ సినిమాలో నేను చూడ బుద్ధి అయితాంది రాజిగో అనే పాట యూట్యూబ్లో ట్రెండింగ్ అవుతూ రికార్డు స్థాయిలో వ్యూస్ ని రాబడుతోంది.కాగా ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయ్యింది.
ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిజీబిజీగా గడుపుతున్నారు.
డిసెంబర్ 23న ధమాకా సినిమా విడుదల కానుంది.ఇది ఇలా ఉంటే తాజాగా రవితేజకు సంబంధించిన ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అదేమిటంటే రవితేజ వద్ద ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న అతని మేనేజర్ కమ్ మేకప్ మ్యాన్ కి టాటా కంపెనీకి చెందిన కాస్ట్లీ కారును గిఫ్ట్ గా ఇచ్చారు.రవితేజ తన డ్రైవర్ కు గిఫ్టుగా ఇచ్చిన ఆ కారు ధర రూ.22 లక్షలు అని సమాచారం.అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఆ వీడియోలో రవితేజ ఇంట్లోంచి బయటికి రాగానే అతని మేనేజర్ వెళ్లి కాళ్లకు నమస్కరించుకొని రవితేజతో కలిసి ఆ కారులో క్యారవాన్ వద్దకు వెళ్లారు.
కాకుండా ఆమె మేనేజర్ ఫ్యామిలీతో కలిసి ఫోటోలు దిగారు రవితేజ.ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.ఆ కారును మొదటి రవితేజ డ్రైవ్ చేయడంతో పాటు అతన్ని పక్కన కూర్చోబెట్టి క్యారవ్యాన్ వరకు కూడా తీసుకెళ్లారు.