వంశీ పైడిపల్లి, దిల్ రాజు కాంబినేష‌న్‌ లో రూపొంద‌నున్న‌ తలపతి విజయ్ 66వ చిత్రంలో క‌థానాయిక‌గా రష్మిక మందన్న

తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న తలపతి విజయ్ ,జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు వంశీ పైడిపల్లితో కలిసి జాతీయ అవార్డు పొందిన‌ నిర్మాత దిల్ రాజు శిరీష్ తమ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పై భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు.

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ చిత్రంలో విజయ్ సరసన కథానాయికగా నటించ‌నున్న‌ట్లు ర‌ష్మిక‌ పుట్టినరోజు సందర్భంగా మేక‌ర్స్ ప్రకటించారు.

సక్సెస్ ఫుల్ కలయికలో రాబోతున్న ఈ చిత్రం అంతే సక్సెస్ ఫుల్ గా తీర్చిదిద్ద‌బోతున్నారు. త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ చిత్రంలో విజయ్‌ని మునుపెన్నడూ చూడని పాత్రలో ప్రెజెంట్ చేయడానికి వంశీ పైడిపల్లి పవర్‌ ఫుల్ స్క్రిప్ట్‌ను రెడీ చేశారు.

ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వ‌ర‌లో తెలియ‌జేయ‌నున్నారు.

తారాగణం:

విజయ్, రష్మిక మందన్న సాంకేతిక సిబ్బంది: రచన‌, దర్శక‌త్వం: వంశీ పైడిపల్లి, నిర్మాతలు: దిల్ రాజు శిరీష్ , బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , PRO: వంశీ-శేఖర్.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు