Animal Movie : యానిమల్ ఫస్ట్ డే కలెక్షన్ల లెక్క తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. ఆ రేంజ్ లో వచ్చాయా?

సందీప్ రెడ్డి వంగా( Sandeep Reddy Vanga ) దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ రష్మిక మందన కలిసి నటించిన తాజా చిత్రం యానిమల్( Animal movie )కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ తాజాగా డిసెంబర్ 1న విడుదలైన విషయం తెలిసిందే.మరి తాజాగా విడుదలైన ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ.200 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది.అందుకు అనుగుణంగానే ఈ సినిమాను దాదాపు 4000 లకు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారట.హిందీలో రూ.50.5 కోట్లు, తెలుగులో రూ.10 కోట్లు, తమిళంలో రూ.40 లక్షలు, కర్నాటక( Karnataka )లో రూ.9 లక్షలు, కేరళలో రూ.1 లక్షలతో కలిపి మొదటి రోజే ఈ సినిమాకు రూ.61 కోట్లు నెట్‌ కలెక్షన్లు వచ్చినట్లు తెలిసింది.

 Ranbir Kapoor Starrer Animal Movie Day 1 Worldwide Box Office Collections-TeluguStop.com
Telugu Animal, Bollywood, Karnataka, Ranbir Kapoor, Sandeepreddy-Movie

వరల్డ్ వైడ్‌గా చూసుకుంటే యానిమల్ మూవీకి ఇండియాలో రూ.70 కోట్లు గ్రాస్ వసూలు అయింది.అలాగే, రణ్‌బీర్ కపూర్‌( Ranbir Kapoor )కు వరల్డ్ వైడ్‌గా చాలా దేశాల్లో అభిమానులు ఉన్నారు.దీంతో ఈ చిత్రాన్ని అంతటా గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.ఇక మొదటి రోజు పూర్తయ్యే సరికి ఈ సినిమా ఓవర్సీస్‌లో 4 మిలియన్ డాలర్లను 33 కోట్లు వసూలు చేసింది.వీటితో కలిపితే ఫస్ట్ డే రూ.103 కోట్లు గ్రాస్ రాబట్టింది.కాగా ఈ సినిమాను దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు.రూ.210 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మొదటి రోజు ఇది రూ.61 కోట్లు రాబట్టింది.

Telugu Animal, Bollywood, Karnataka, Ranbir Kapoor, Sandeepreddy-Movie

అంటే ఇంకా రూ.149 కోట్లు నెట్‌ను ఇది వసూలు చేస్తేనే హిట్ అవుతుంది.ప్రస్తుతం ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ ని బట్టి చూస్తే టార్గెట్ ను రీచ్ కావడం అన్నది పెద్ద సంగతి ఏం కాదు అని తెలుస్తోంది.

ఇవాళ రేపు వీకెండ్ కావడంతో ఈ సినిమా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube